
ఘనంగా తీజ్ వేడుకలు
● భక్తి శ్రద్ధలతో బంజారాల పండగ
● ఉత్సాహంగా పాల్గొన్న యువతులు
జనగామ: జిల్లాలో తీజ్ ఉత్సవాలను బంజారాలు ఘనంగా జరుపుకున్నారు. మహిళలు, యువతులు, చిన్నారులు కొత్త బట్టలు ధరించి, రంగు రంగుల పూలతో అలంకరించుకున్న ఊయలల వద్ద భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. తొమ్మిది రో జులపాటు జరుపుకునే తీజ్ ఉత్సవాలను పురస్కరించుకుని ఆదివారం జిల్లా కేంద్రంలో జరిగిన తీజ్ ఉత్సవాల్లో బంజా రా ఆడబిడ్డలు ఉత్సాహంగా పాల్గొని గోధుమలను బుట్టల్లో చల్లి భక్తిని చాటుకున్నారు. గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్ట ణ మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాటలు పాడుతూ, ఊయల ఆడుతూ ఆనందంగా గడిపారు. మహిళలు పరస్పరం తాంబూలాలు పంచుకుంటూ, మిఠాయిలు, పిండి వంటలు స మర్పించారు. కుటుంబం సుఖశాంతులతో నిండాలని కోరుకుంటూ తీజ్ ఉత్సవాలను ఉత్సాహంగా జరుపుకున్నారు. వేడుకల్లో 2వ వార్డు మాజీ కౌన్సి లర్ వాంకుడోతు అనిత, డాక్టర్ స్వప్న రాథోడ్, మంజుల, మమత, భారతి, కవిత, వరలక్ష్మి, లలిత, విజయ, పుష్ప, ప్రమీల, వరలక్ష్మి, విమల, సునీత, నవనీత, రేనా తదితరులు పాల్గొన్నారు.
కడగుట్ట తండాలో..
కొడకండ్ల : మండలంలోని కడగుట్ట తండా పరిధిలోని దుబ్బతండాలో ఆదివారం తీజ్ వేడుకలను గ్రామస్తులు ఘనంగా జరుపుకున్నారు. తండా పెద్ద బానోత్ హుస్సేన్‌నాయక్ ఆధ్వర్యంలో గిరిజన యువతులు ఆచార సాంప్రదాయాలకనుగుణంగా వేడుకలను నిర్వహించారు.

ఘనంగా తీజ్ వేడుకలు