
తిరుగుపయనం
● ముగిసిన సెలవులు
● రద్దీగా మారిన ఆర్టీసీ బస్టాండ్
శ్రీకృష్ణజన్మాష్టమి, శ్రావణమాసం పర్వదినం బోనాల జాతర, అంతకుముందు వానల నేపథ్యంలో ప్రభుత్వ సెలవుల నేపథ్యంలో గ్రామాలకు వచ్చిన విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు తిరుగుపయనమయ్యారు. ఆదివారం ఒక్కసారిగా జనగామ ఆర్టీసీ బస్టాండ్‌తోపాటు బచ్చన్నపేట, రఘునాథపల్లి, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్ తదితర మండలాల పరిధిలోని బస్టాప్‌లు ప్రయాణికులతో నిండిపోయాయి. ఉప్పల్, జగద్గిరిగుట్ట, మేడిపల్లి, చింతల్, లింగంపల్లి, కూకట్‌పల్లి, ఎల్‌బీనగర్, హనుమకొండ తదితర ప్రాంతాలకు వెళ్లే సమయంలో ఒక్కో బస్సులో 110 మందికి పైగా కిక్కిరిసి ప్రయాణం చేయాల్సి వచ్చింది. కొంతమంది ప్రయాణికులు సీటులేక గమ్యస్థానం చేరుకునే వరకు నిల్చునే ఉన్నారు. – జనగామ