
అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
జనగామ రూరల్: ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, స్టేషన్‌ఘన్‌పూర్‌లో 2025–26 విద్యా సంవత్సరానికి కామర్స్ విభాగంలో అతిథి అధ్యాపకుల పోస్టుల భర్తీకి అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాహత్ ఖానం శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు సంబంధిత పీజీ కోర్సులో 55 శాతం మార్కులతో పాసై ఉండాలని, నెట్, సెట్, పీహెచ్‌డీ వారికి మొదటి ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 19న సాయంత్రం 4 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 20న ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంటర్వ్యూ ఉంటుందన్నారు.