
వైభవంగా గోకులాష్టమి
సీతారామచంద్ర స్వామి దేవాలయంలో కృష్ణుడు, గోపిక వేషధారణలో చిన్నారులు
జిల్లాలోని అన్ని గ్రామాలు, మండలాల్లో గోకులాష్టమి వేడుకలను శనివారం ప్రజలు భక్తిశ్రద్ధలతో వైభవంగా జరుపుకున్నారు. విశ్వహిందూ పరిషత్, బాలభారతి, హిందూ జ్ఞానవేదిక–ప్రబోధా సేవా సమితి, గీతాశ్రమం, శ్రీ కృష్ణ ఉత్సవ కమిటీ (గొల్ల కురుమ సంఘం) ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు బనుక సిద్ధిరాజ్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్‌యాదవ్‌తో పాటు తదితరులు ఆర్టీసీ చౌరస్తా నుంచి ఊరేగింపుగా నెహ్రూపార్కు వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపిక వేషధారణలో అలరించారు. – జనగామ
మరిన్ని ఫొటోలు 9లో..
ర్యాలీలో పాల్గొన్న గొల్ల,కురుమలు

వైభవంగా గోకులాష్టమి

వైభవంగా గోకులాష్టమి

వైభవంగా గోకులాష్టమి

వైభవంగా గోకులాష్టమి