ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలి

Aug 17 2025 7:44 AM | Updated on Aug 17 2025 7:44 AM

ఫీజు

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలి

జనగామ రూరల్‌: పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వెంటనే విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ కేంద్ర కమిటీ సభ్యురాలు మేడబోయిన మమత ప్రభుత్వాన్ని డి మాండ్‌ చేశారు. శనివారం జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పొదల లవకుమార్‌ అధ్యక్షతన ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న రూ. 8 వేల కోట్ల స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బకాయిలు విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందన్నారు. తక్షణమే పెండింగ్‌ బకాయిలు విడుదల చేయకుంటే ఎమ్మెల్యేలను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి దాసగాని సుమ, జిల్లా ఉపాధ్యక్షులు మామిడాలా రమేశ్‌, భూక్యా యాకన్న రాథోడ్‌, సహాయ కార్యదర్శి బొమ్మిశెట్టి ఆర్య, మనీత్‌ రాజ్‌, కృష్ణ, స్నేహ, మానస నాగశ్రీ తదితరులు పాల్గొన్నారు.

టీఎల్‌ఎం మేళా పూర్తి చేయాలి

జనగామ: ఈ నెల 21వ తేదీ వరకు మండల స్థాయి టీఎల్‌ఎం మేళా వందశాతం పూర్తి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. ఈ మేరకు శనివారం వారు మాట్లాడుతూ టీఎల్‌ఎం మేళా పూర్తి చేసి, విజేతల వివరాలను స్పైడ్‌ షీట్‌లో నమోదు చేసి, అందుకు సంబంధించిన కాపీలను 21వ తేదీ సాయంత్రం వరకు వాట్సాప్‌ ద్వారా ఉన్నతాధికారులకు పంపించాలన్నారు.

రేపు డిజిటల్‌ అక్షరాస్యతపై శిక్షణ

ఈ నెల 18న జిల్లా స్థాయిలో 1 నుంచి 5వ తరగతి వరకు గణిత సబ్జెక్టును బోధించే టీచర్ల(మండల రిసోర్స్‌ పర్సన్లు)కు డిజిటల్‌ అక్షరాస్యత, ఆర్టిఫిషల్‌ ఇంటెలిజెన్స్‌ బోధనపై జిల్లా కేంద్రం హైదరాబాద్‌ రోడ్డు సెయింట్‌ మెరీస్‌ హైస్కూల్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించి 12 మండలాల ఎంఈఓలకు డీఈఓ శనివారం ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు జరిగే శిక్షణకు ల్యాప్‌టాప్‌ లేదా ట్యాబ్‌ వెంట తెచ్చుకోవాలన్నారు. శిక్షణకు హాజరు కాని టీచర్లపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

రాష్ట్రస్థాయి వాలీబాల్‌ పోటీలకు ఎంపిక

పాలకుర్తి: ఈ నెల 18, 19వ తేదీల్లో రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో జరగనున్న రాష్ట్రస్థాయి వాలీబాల్‌ పోటీలకు పాలకుర్తి మండలం గూ డూరు, చెన్నూరు జెడ్పీహెచ్‌ఎస్‌ నుంచి ఐదుగురు విద్యార్థులు ఎంపిౖకైయ్యారని పీడీ చిట్యాల యాదగిరి తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ గూడూరుకు చెందిన భూక్యా రాకేష్‌, కీర్తి శ్రీకల, చెన్నూరుకు చెందిన మొలుగూరి అఖిల, చిలువేరు రేవతి, అర్కల సాత్విక్‌లు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారన్నారు. ఈ మేరకు హెచ్‌ఎంలు శైలజ, రమేశ్‌, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించి రాష్ట్రస్థా యిలో కూడా ప్రతిభ కనబర్చాలని కోరారు.

గుట్కా ప్యాకెట్ల పట్టివేత

కొడకండ్ల: మండలకేంద్రంలోని పాపన్నచౌరస్తాలో నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తులను పట్టుకున్నట్లు ఎస్సై చింత రాజు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం పాపన్నచౌరస్తాలో వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో సూర్యాపేట జిల్లా తిర్మలగిరి మండలం గుండెపురి కేఆర్‌కే తండాకు చెందిన లకావత్‌ విజయ్‌ స్కూటీని తనిఖీ చేయగా పొగాకు ఉత్పత్తులను లభ్యమయ్యాయన్నారు. విజయ్‌ నల్లగొండకు చెందిన వినోద దగ్గర తక్కువ ధరకు కొనుగోలు చేసి కొడకండ్లలోని కిరాణా షాపులకు అమ్ముతున్నాడు. స్వాధీనం చేసుకున్న పొగాకు ఉత్పత్తుల విలువ రూ.1.52లక్షలు ఉంటుందన్నారు. ఈ మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తున్న నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభను కనబర్చిన ఎస్సై రాజు, ఏఎస్సై కత్తి రమేశ్‌, కానిస్టేబుల్స్‌ రాకేష్‌, వెంకటేష్‌లను డీసీపీ రాజమహేంద్రనాయక్‌ అభినందించారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలి1
1/2

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలి

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలి2
2/2

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement