
సోమేశ్వరాలయంలో ఎమ్మెల్యే పూజలు
పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శనివారం ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి దంపతులు స్వామివారిని దర్శించుకోని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారి శేష వస్త్రాలతో ఘనంగా సన్మానించి, ప్రసాదం అందజేశారు. అలాగే మండలంలోని వల్మిడి శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ సల్వాది మోహన్‌బాబు, అర్చకులు దేవగిరి లక్ష్మన్న, డీవీఆర్‌శర్మ, దేవగిరి అనిల్‌కుమార్, మత్తగజం నాగరాజు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.