
పత్తి చేను ధ్వంసం
దేవరుప్పుల: సాగు చేసిన పత్తిమొక్కలను ధ్వంసం ఘటన శనివా రం పెద్దమడూరులో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. పెద్దమడూరుకు చెందిన మడిపెల్లి కొమురయ్య రెండు ఎకరాలు, సంగీ అంజయ్యకు చెందిన 30గుంటల భూమి వారి పేరుమీద పట్టాదారు పాస్ పుస్తకం ఉండటంతో పత్తి పంట సాగు చేశారు. ఇదే గ్రామానికి చెందిన ఓ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు భూ రికార్డుల్లో తమ పేర్లు కూడా ఉన్నాయనే సాకుతో పెద్ద ఎత్తున వెళ్లి శనివారం పత్తి మొక్కలను పీకేశారు. ఈ విషయమై బాధిత రైతులు పీఎస్‌లో ఫిర్యాదు చేయగా చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు తహసీల్దార్ అండాలుకు సిఫారసు చేసినట్లు ఎస్సై సృజన్‌కుమార్ తెలిపారు.