
విద్య, వైద్యానికి పెద్దపీట
2.39 కోట్ల మహిళలకు ఉచిత ప్రయాణం
– వివరాలు 8లోu
స్వయం సహాయ సంఘాలకు రూ.46.03కోట్ల రుణం
కుల గణన దేశానికే రోల్‌మోడల్
ధర్మకంచ మినీ స్టేడియంలో
జాతీయ జెండాను
ఎగుర వేసి
సెల్యూట్ చేస్తున్న
ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, పక్కన కలెక్టర్ రిజ్వాన్ బాషా, డీసీపీ రాజమహేంద్రనాయక్
జనగామ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తున్న ఘనత కాంగ్రెస్ సర్కారుకే దక్కుతుందని ఆలేరు ఎమ్మెల్యే, ప్ర భుత్వ విప్ బీర్ల అయిలయ్య అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రం ధర్మకంచ మినీ స్టేడియంలో జరిగిన 79వ పంద్రాగస్టు దినోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవి ష్కరించారు. అనంతరం పోలీసు గౌరవ వందనం స్వీకరించి, పో లీసుల మార్చ్ ఫాస్ట్ తిలకించాను. అనంతరం జాతీయ, తెలంగాణ గీతం ఆలపించారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై విప్ మాట్లాడారు. 2047 నాటికి భా రత్ రూపురేఖలు మార్చే గేమ్ ఛేంజర్‌లో తెలంగాణ కీలక పాత్ర పోషించాలనే లక్ష్యంతో ‘తెలంగాణ రైజింగ్ 2047’ ప్రణాళికతో సీఎం రేవంత్‌రెడ్డి ముందుకు వెళ్తున్నారన్నారు. రాష్ట్రంలో చేపట్టిన కులగణన దేశానికి రోల్‌మోడల్‌గా నిలుస్తుందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి, పార్లమెంటుకు పంపించిన ఘనత తమకే దక్కుతుందన్నారు.
జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 5,998 ఇందిరమ్మ ఇళ్లు మంజూరీ కాగా, ఇందులో 4,750 చోట్ల గ్రౌండింగ్ పూర్తై, నిర్మాణ పనులు మొదలైనట్లు పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతుందన్నారు. గత సీజ న్‌లో 1.66 లక్షల మెట్రిక్ టన్ను ల ధాన్యం కొనుగోలు చేసి, రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.386కోట్లు జమ చేసినట్లు తెలిపారు. 2024–25 వార్షిక సంవత్సరంలో పదో తరగతిలో రా ష్ట్రంలో 98.81శాతంతో ఉత్తమ ఫలితాలు సాధించగా, కలెక్టర్ రిజ్వాన్ బాషా, విద్యాశాఖ సంయుక్త భాగస్వామ్యంతో జాతీయ స్థాయిలో న్యాస్‌లో ఉత్తమంగా నిలవడం గర్వకారణమన్నారు. వానాకాలం సీజన్‌లో రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు రైతుభరోసా ద్వారా రూ.3.51లక్షల ఎకరాల సాగు భూమికి రూ.2.33 కోట్ల మేర జమ చేశామన్నారు. మహిళలను మరింత ఆర్థిక బలోపేతం చేయాలనే సీఎం రేవంత్‌రెడ్డి సంకల్పం మేరకు ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో 50 వణిత టీస్టాల్స్ ఏర్పాటు లక్ష్యంగా రూ.158.29కోట్ల రుణాలు అందించినట్లు చెప్పారు. దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేసేందుకు 90శాతం మేర భూసేకరణ పూర్తి చేసినట్లు స్పష్టం చేశారు. అలాగే జిల్లాలో ప్రతి నీటి బొట్టును భూమిలోకి పంపించి, భూగర్భ జలాల సాధనే లక్ష్యంగా కలెక్టర్ ముందు చూపుతో 7,175 ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టి మరో రికార్డు సృష్టించారన్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో అన్ని శాఖల సమన్వయంతో జనగామలో సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలవుతున్నాయన్నారు. అభివృద్ధి పథకాల అమలులో భాగంగా కృషి చేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, మీడియాకు విప్ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల అమలు తీరు తెన్నులను అద్ధంపట్టేలా ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్, డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్, ఆర్డీఓ గోపీరామ్, తహసీల్దార్ హుస్సేన్ తదితరులు ఉన్నారు.
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా కేంద్రం ధర్మకంచ మినీ స్టేడియంలో జరిగిన వేడుకల్లో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఇందులో లింగాలఘనపురం, చౌడారం, స్టేషన్‌ఘన్‌పూర్ కేజీబీవీ, నెహ్రూపార్కు రోడ్డు సెయింట్ పాల్స్, జనగామ రైల్వేస్టేషన్ ఏరియా, ఘన్‌పూర్ ఉన్నత పాఠశాలలు, ఎర్రగొల్లపహాడ్ యూపీఎస్, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు కరాటేతో పాటు దేశ భక్తిని చాటుకునేలా ప్రదర్శనలు నిర్వహించారు. 2024–25 వార్షిక సంవత్సరంలో పాఠశాల విద్యాశాఖలో కొనసాగుతున్న ఉన్నత పాఠశాలలు, ఇంటర్ కళాశాలల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు విప్ చేతలు మీదుగా ఒకొక్కరికి రూ.10వేల చొప్పున 8 మందికి రూ.80 వేల నగదు పురస్కారంతో పాటు సర్టిఫికెట్లను అందించారు. విద్యార్థులు బోయిని నాగవైష్ణవి (10వ తరగతి, కొడకండ్ల, టీజీఆర్‌ఎస్), జనగామ శ్రీజ (10వ తరగతి, కొడకండ్ల, టీజీఆర్‌ఎస్), ఆరు సాయివంశీ (10వ తరగతి, నర్మెట,మోడల్), ఎండీ గులాంసాధిక్ (10వ తరగతి, కొడకండ్ల, ఉన్నత పాఠశాల), జక్కుల పల్లవి (ఇంటర్, ఎంపీసీ, కొడకండ్ల, టీజీఆర్‌జేసీ, బాలికలు), చింతకింది స్పందన (ఇంటర్,ఎంపీసీ, కొడకండ్ల, టీజీఆర్‌జేసీ, బాలికలు) కున్సోతు నితిన్ కుమార్ (ఇంటర్, ఎంపీసీ,కొడకండ్ల, మోడల్), ఏ.హరిబాబు (ఇంటర్, సీఈసీ, స్టేషన్‌ఘన్‌పూర్, మోడల్) విద్యార్థులు ఉత్తమ ప్రతిభతో నగదు బహుమతిని అందుకున్నారు.
మాట్లాడుతున్న
ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య
జిల్లాలో మహాలక్ష్మి పథకంలో 2.39 కోట్ల మహిళా ప్రయాణికులకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా రూ.110.75 కోట్ల మేర లబ్ధి చేకూరిందన్నారు. 76,403 తెల్లరేషన్ కార్డుదారులకు రూ.500 సబ్సిడీ అందించామన్నారు. గృహజ్యోతి ద్వారా 14.59 లక్షల పేద కుటుంబాలకు 200 యూనిట్ల చొప్పున ఇప్పటి వరకు రూ.42.04 కోట్లు మేర జీరో కరెంటు బిల్లులు ఇష్యూ చేశామని, రాజీవ్ ఆరోగ్యశ్రీలో ఉచిత వైద్య సేవలకు గాను రూ.10 లక్షల వరకు పెంచగా, జిల్లాలో 23,345 మందికి శస్త్ర చికిత్సలు చేసి, వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించామన్నారు. జిల్లాలోని 12 మండలాల పరిధిలో 59,745 మంది రైతులకు రూ.522.72 కోట్ల మేర పంట రుణమాఫీ చేశామన్నారు.
ఉత్తములకు ప్రశంస
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కాంగ్రెస్ ఘనత
ప్రగతిలో జిల్లా అగ్రగామి
ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య
అంబురాన్నంటిన 79వ స్వాతంత్య్ర దినోత్సవ సంబురాలు
జిల్లాలోని 420 మహిళా స్వయం సహాయ సంఘాలకు సీ్త్రనిధి–మెప్మా, ఐకేపీ ద్వారా మంజూరైన రూ.46.03 కోట్ల రుణాలను విప్ బీర్ల అయిలయ్య చేతుల మీదుగా అందించారు. ఇందులో డీఆర్డీ ద్వారా 377 సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా రూ. 40.30కోట్లు, సీ్త్రనిధి–మెప్మా ద్వారా 43 సంఘాలకు రూ.5.73 కోట్ల చెక్కులను అందించారు.

విద్య, వైద్యానికి పెద్దపీట

విద్య, వైద్యానికి పెద్దపీట

విద్య, వైద్యానికి పెద్దపీట