
కవులు, కళాకారుల నిలయం జనగామ
జనగామ: జనగామ జిల్లా కవులు, కళాకారులకు నిలయంగా కీర్తించబడుతుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశం హాలులో తెలంగాణ గెజిటెడ్ ఆఫీస ర్స్ అసోసియేషన్ 9వ వార్షికోత్సవం కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా కలెక్టర్ టీజీఓ జనగామ సమాచార దర్శినిని ఆవిష్కరించారు. ఇందులో జనగామ జిల్లా చరిత్రను పొందు పరచడం గొప్ప విషయమన్నారు. జిల్లా విశిష్టతను తెలిపే విధంగా వీటిని ముద్రించి అందుబాటులో ఉంచితే భవిష్యత్ తరాలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అనంతరం వక్తలు మాట్లాడు తూ బచ్చన్నపేట మండలం కట్కూరుకు చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయురాలు, రచయిత్రి బల్ల సరస్వతి 1970 ప్రాంతంలో చిట్టి చిలకమ్మా గేయాన్ని రాయగా, తెలంగాణ ఆత్మకథ, తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజల పోరు, విద్యార్థుల బాధలను కళ్లకు కట్టినట్టుగా శిశిరధ్వని గేయ కావ్యాన్ని రచించి లక్షలాది మంది ప్రజల అభిమాన్ని చూరగొన్నారన్నారు. అనంతరం బల్ల సరస్వతిని ఘనంగా సత్కరించారు.
ఒగ్గు కళాకారుడికి సన్మానం
లింగాలఘణపురం: ఇండియన్ కాన్సులేట్ జనరల్ డాక్టర్ మదన్‌మోహన్‌శెట్టి చేతుల మీదుగా ఒగ్గుఢోలు కళాకారుడు, ఉస్తాద్ ఒగ్గు రవిని న్యూజిలాండ్‌లోని అక్లాండ్‌లో సన్మానించారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవంలో భాగంగా రాష్ట్రం నుంచి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, సీడీ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో అక్లాండ్ వేదికగా జరిగిన ప్రదర్శనలో ఒగ్గుఢోలు, పేరిణి, డప్పు కళాకారులు అద్భుతంగా తమ ప్రదర్శనలు ఇచ్చారు. దీంతో కళాకారులను ఇండియన్ కాన్సులేట్ జనరల్ మోహన్‌శెట్టి సన్మానించారు. ఈ సందర్భంగా భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, సీడీ ఫౌండేషన్ చైర్మన్ చారుదాసులకు కళాకారులు కృతజ్ఞతలు తెలిపారు.
పద్మశ్రీ గడ్డం సమ్మయ్యకు..
దేవరుప్పుల: టీజీఓఎస్ ఽఆధ్వర్యంలో అప్పిరెడ్డిపల్లెకు చెందిన ప్రముఖ చిందు యక్షగాన కళాకారుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత గడ్డం సమ్మయ్యను కలెక్టర్ రిజ్వాన్‌బాషా సన్మానించారు. అంతముందుకు అమృత్ సరోవర్‌లో భాగంగా చిన్నమడూరు కోమటికుంటలో జాతీ య పతాకాన్ని సమ్మయ్య ఎగురవేసి స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులర్పించారు.
కొడకండ్ల: మండలంలోని నర్సింగాపురంలో పంట పొలాల్లో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం జాతీయ జెండాను ఎగురవేశారు. దేశగాని సతీష్‌గౌడ్, పలువురు రైతులు కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పార్టీ కార్యాలయాల వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించగా రైతులు వినూత్నంగా పంట పొలాల వద్ద జెండాను ఆవిష్కరించుకోవడం విశేషం. ఈ కార్యక్రమంలో కప్పల రాజాలు, సోమయ్య, భిక్షపతి, శివ, సారయ్యలు పాల్గొన్నారు.
‘నవోదయ’ గడువు పెంపు
మామునూరు : వరంగల్ మామునూరులోని జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరోతరగతిలో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 27వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు నవోదయ ప్రిన్సిపాల్ పూర్ణిమ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 13న తేదీతో ముగియగా.. విద్యాలయ సమితి మరోమారు గడువు పెంచుతూ అవకాశం కల్పించిందని పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు గమనించి నవోదయ విద్యాలయంలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు.

కవులు, కళాకారుల నిలయం జనగామ

కవులు, కళాకారుల నిలయం జనగామ

కవులు, కళాకారుల నిలయం జనగామ