
సమరయోధుల అడుగుజాడల్లో నడవాలి
జనగామ రూరల్: స్వాతంత్య్ర సమరయోధులను ఆదర్శంగా తీసుకొని వారి అడుగుజాడల్లో నడవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ అన్నారు. పంద్రాగస్టు దినోత్సవం సందర్భంగా శు క్రవారం జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు కోర్టు సిబ్బందిని ఉద్దేశించి ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతుందని, స్వేచ్ఛ స్వతంత్య్రం కోసం పోరాడి వారి ప్రాణాలను త్యాగాలు చేశారన్నారు. అనంతరం కోర్టు ప్రాంగణంలో జరిగిన ఆటల పోటీల్లో గెలుపొందిన న్యాయవాదులకు, సిబ్బందికి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జిలు విక్రమ్, సుచరిత, జూని యర్ సివిల్ జడ్జి శశి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దండబోయిన హరిప్రసాద్ యాదవ్, సీనియ ర్ అడ్వకేట్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ గవర్నమెంట్ లీడర్స్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, న్యాయవాదులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ