చుక్క రాలితే ఒట్టు | - | Sakshi
Sakshi News home page

చుక్క రాలితే ఒట్టు

Aug 14 2025 7:04 AM | Updated on Aug 14 2025 7:04 AM

చుక్క

చుక్క రాలితే ఒట్టు

రెడ్‌ నుంచి ఆరెంజ్‌ అలర్ట్‌

జిల్లాలో విచిత్రంగా వాతావరణం

నేడు భారీ నుంచి అతి భారీ

వర్షాలు కురిసే అవకాశం

జనగామ: వర్షం పరిస్థితి జనగామలో చిత్రవిచిత్రంగా మారింది. వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జోన్‌లో జనగామ జిల్లాను చూపించగా... ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా రియాక్ట్‌ అయింది. అధికార యంత్రంగాన్ని అలర్ట్‌ చేస్తూనే.. అత్యవసర పరిస్థితుల నేపధ్యంలో విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. అయితే వరణుడు రెస్ట్‌ కోసం లీవ్‌ తీసుకున్నట్టుగా మొత్తానికి మొత్తంగా ముఖం చాటేశాడు. జిల్లాలో ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి వరకు కురిసిన మోస్తరు వర్షంతో సరిపెట్ట గా.. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు చుక్క రాల్చలేదు. అయితే అర్థరాత్రి లేదా నేడు (గురువారం) ఆకస్మికంగా, తక్కువ సమయంలో అధిక పరిమాణంలో వర్షం (క్లౌడ్‌ బరస్ట్‌) కురిసే అవకాశం ఉంది.

రెడ్‌ నుంచి ఆరెంజ్‌ అలర్ట్‌

జనగామ జిల్లాను వాతావరణ శాఖ రెడ్‌ నుంచి ఆరెంజ్‌ (అతి భారీ వర్షాలు) అలర్టుగా ప్రకటించింది. జిల్లాలో అర్థరాత్రి లేదా నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపధ్యంలో కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా అధికార యంత్రాంగాన్ని అలర్టు చేశారు. కల్వర్టులు, ప్రమాదకరమైన రోడ్లు, శిథిలావస్థలో ఉన్న పెంకుటిళ్లు, విద్యుత్‌ స్తంభాలు, ప్రమాదకర చెరువు కట్టలు, అత్యవసర సమయంలో ప్రజలకు వైద్య పరీక్షలు, రవాణా సౌకర్యంలో అంతరాయం కలుగకుండా పర్యవేక్షణ బాధ్యతలను ఆయా శాఖల అధికారులకు అప్పగించారు. మున్సిపల్‌, కలెక్టరేట్‌, వైద్యరోగ్య శాఖల పరిధిలో వేర్వేరుగా కంట్రోల్‌ రూంలను ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. నర్మెట నుంచి వెల్దండకు వెళ్లే ప్రధాన రహదారి ఊర చెరువు మత్తడి ప్రాంతంలో భారీ వర్షం కురిసిన సమయంలో నీరు రోడ్డుపై ప్రవహిస్తే రాకపోకలు నిలిచే అవకాశం ఉంది. రఘునాథపల్లి ఇబ్రహీంపూర్‌ పెద్ద చెరువులు అలుగు పోస్తుండడంతో అటువైపు ఎవరూ కూడా వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇలా జిల్లాలోని పలు ప్రమాదకర ప్రాంతాల్లో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.

రిజర్వాయర్లలో నీటి మట్టం (మిలియన్‌ క్యూబిక్‌ ఫీట్‌/ఎంసీఎఫ్‌టీ)

రిజర్వాయర్‌ కెపాసిటీ నీటి మట్టం శాతం

స్థాయి

మండలాల వారీగా నమోదైన వర్షపాతం వివరాలు

తేదీ మిల్లీ మీటర్లు

07 53.6

08 60.9

09 02.1

11 18.2

12 45.6

13 16.2

మత్తడి పోస్తున్న 96 చెరువులు

జిల్లాలో 779 చెరువులు ఉండగా, వీటి పరిధిలో 49,643 ఆయకట్టు ఉంది. ఇందులో 75 నుంచి 100 శాతం 126 చెరువుల్లో నీటి మట్టం పెరుగగా, 96 చోట్ల మత్తడి పోస్తున్నాయి. గండిరామారం, బొమ్మకూరు, కన్నెబోయిన గూడెం, వెల్దండ రిజర్వాయర్లలో 80 శాతం మేర నీటి మట్టం పెరుగగా, మిగతా చోట్ల 60 శాతం వ రకు నీరు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

గండిరామారం 400 334 83.50

బొమ్మకూరు 198 162.180 81.91

చీటకోడూరు 300.258 190.084 63.31

నవాబుపేట 550.510 246.120 44.71

ఆర్‌ఎస్‌ ఘన్‌పూర్‌ 1,570 1,063 67.71

అశ్వరావుపల్లి 740 466 62.97

కన్నెబోయినగూడెం 120 96.490 80.41

వెల్దండ 150 112.950 75.30

చెరువుల్లో నీటి మట్టం వివరాలు (శాతంలో..)

చెరువులు 0–25 25–50 50–75 75–100 మత్తడి పోస్తున్నవి

779 338 151 107 87 96

చుక్క రాలితే ఒట్టు1
1/2

చుక్క రాలితే ఒట్టు

చుక్క రాలితే ఒట్టు2
2/2

చుక్క రాలితే ఒట్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement