
సీఆర్‌టీలపై వేటుకు రంగం సిద్ధం!
బచ్చన్నపేట: సీఆర్‌టీలపై వేటుకు రంగం సిద్ధమైంది. ఇటీవల మండలంలోని కేజీబీవీలో స్పెషల్ ఆఫీసర్ విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసిందనే విషయమై ఇటీవల సాక్షిలో ‘టీచర్లు కొట్టిన విషయం చెప్పొద్దు’ అనే కథనం ప్రచురితమైన విషయం విధితమే. దీంతో స్పందించిన అదనపు కలెక్టర్ సుహాసిని, జీసీడీఓ గౌసియాబేగంలు కేజీబీవీలో విద్యార్థినులను విచారణ చేశారు. పాఠశాల పరిస్థితులు, ఉపాధ్యాయులు పనితీరును విద్యార్థినులను అడిగి లిఖితపూర్వకంగా తీసుకున్నారు. దీనిపై నివేదిక తయారు చేసి కలెక్టర్‌కు అందించినట్లు తెలిపారు. ఈ నివేదిక ఆధారంగా పలువురు సీఆర్‌టీలపై వేటు వేయడానికి రంగం సిద్ధమైనట్లు సమాచారం.
విద్యార్థి ఉన్నతికి కృషి
● సీజేఐటీ డైరెక్టర్ విజయపాల్‌రెడ్డి
● కెరీర్ ఓరియంటేషన్,
ఉద్యోగ నైపుణ్యంపై శిక్షణ
జనగామ: విద్యార్థి ఉన్నతికి క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్ కళాశాల కృషి చేస్తుందని సంస్థ డైరెక్టర్ డి.విజయపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం సీజేఐటీలో బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థులకు కెరీర్ ఓరియంటేషన్, ఉద్యోగ నైపుణ్యంపై ఒక్క రోజు శిక్షణ నిర్వహించారు. అనంతరం విజయపాల్‌రెడ్డి మాట్లాడు తూ విద్యార్థులు తమ ఉజ్వల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని క్రమశిక్షణతో ముందుకు వెళ్లాలన్నారు. విద్యార్థులు బోధన పద్ధతులు, విషయ పరిజ్ఞానం ఎలా పెంపొందించుకోవాలనే దానిపై సంపూర్ణ అవగాహన కల్పించారన్నారు. పిల్లలకు ఇలాంటి కార్యక్రమాలు చక్కగా ఉపయోగపడతాయన్నారు. చదువులో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించినా, సాఫ్ట్ స్కిల్స్, లాజికల్ ఎబిలిటీ, లైఫ్‌స్కిల్స్ లేకుండా ఉద్యోగం సంపాధించడం కష్టమన్నారు. శిక్షకుడు, ఇన్‌స్ప్రేషన్ మోటివేషనల్ కోచ్ సీఎచ్ శ్రీని వాస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.చంద్రశేఖర్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.
హర్ ఘర్ తిరంగా ర్యాలీ
రఘునాథపల్లి: మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాలతో చేపట్టిన ద్విచక్ర వాహన ర్యాలీని జిల్లా నాయకుడు, కల్నల్ డాక్టర్ భిక్షపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ భావం పెంపొందించేందుకే తిరంగా ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. మండల అధ్యక్షుడు పుప్పాల వేణుకుమార్ యువమోర్చా మండల అధ్యక్షుడు బోల్ల రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీలో ప్రభాకర్, వెంకట్‌రెడ్డి, సదానందం, సోమేశ్వర్, ఉపేందర్, శ్రీకాంత్, నాయకులు పాల్గొన్నారు.
దివ్యాంగుల పింఛన్
పెంచాలి
స్టేషన్‌ఘన్‌పూర్: సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల ముందు చేసిన హామీలకు అనుగుణంగా దివ్యాంగులకు, చేయూత పెన్షన్‌దారులకు తక్షణమే పింఛన్లు పెంచాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జనగామ జిల్లా ఇన్‌చార్జ్ బోడ సునీల్ డిమాండ్ చేశారు. ఘన్‌పూర్ డివిజన్‌కేంద్రంలో దివ్యాంగులు, చేయూత పెన్షన్‌దారుల సమావేశాన్ని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు గుర్రం నవీన్ అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సునీల్ మా ట్లాడుతూ దివ్యాంగులకు పెన్షన్‌ను రూ.4వేల నుంచి రూ.6వేలు, వృద్ధులు, వితంతువుల చేయూత పెన్షన్‌ను రూ.2016 నుంచి రూ.4వేలకు పెంచుతామని ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 19న నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించనున్న మహాసభకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ హాజరుకానున్నారని, దివ్యాంగులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో ఎంఎస్‌పీ జిల్లా నాయకుడు గాదె శ్రీధర్, వీహెచ్‌పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి కుమార్, నాయకులు సోమరాజు, చక్రపాణి, రవీందర్, సుధాకర్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.

సీఆర్‌టీలపై వేటుకు రంగం సిద్ధం!

సీఆర్‌టీలపై వేటుకు రంగం సిద్ధం!