
ప్రయాణికులు ఇబ్బందులు పడొద్దు
లింగాలఘణపురం: వర్షాలు అధికంగా కురుస్తున్న నేపథ్యంలో రోడ్లు తెగిపోవడం, వాహనాలు దిగబ డి ప్రయాణికులు ఇబ్బందులు పడొద్దని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. బుధవారం మండలంలోని కుందారం–పాలకుర్తి రోడ్డులో పటేల్‌గూడెం బ్రిడ్జి వద్ద కర్రలోడుతో వెళ్తున్న లారీ దిగబడి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఎస్సై శ్రావణ్‌కుమార్ ఆధ్వర్యంలో వాహనాన్ని తీసి ప్రయాణిలకు ఇబ్బందిలేకుండా చేశారు. ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ బ్రిడ్జి వద్దకు వెళ్లి అధికారులకు తగిన సూచనలు చేశారు. రాబోయే రెండుమూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ బ్రిడ్జిని డీసీపీ రాజమహేంద్రనాయక్, తహసీల్దార్ రవీందర్, ఎంపీడీఓ రఘురామకృష్ణ తదితరులు పరిశీలించి కలెక్టర్ ఆదేశాల మేరకు తగిన చర్యలు తీసుకున్నారు.
యూరియా కొరత లేదు..
జనగామ రూరల్: జిల్లాలో సాగుకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా, మండల వ్యవసాయ అధికా రులతో కలిసి పీఏసీఎస్ అధికారులతో గూగుల్ మీ ట్‌లో మాట్లాడారు. జిల్లాలో అన్ని ఏజెన్సీలలో కలి పి 1,788 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయని సా గు చేసుకునే రైతులకే అమ్మకం జరిగేలా అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. వ్యవసాయ అధికా రులు ఫర్టిలైజర్ షాపులను క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయాలన్నారు. యూరియా కొరత సమస్య ఎదురైతే అధికారులపై చర్యలు తప్పవన్నారు.
కొడకండ్ల: భారీ వర్షాల నేపధ్యంలో ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అధికారులను ఆదేశించారు. బుధవారం మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. రామవరం పాత చెరువు, ఫర్టిలైజర్ షాపులు, పీఏసీఎస్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా కార్యాలయాల్లోని రిజిస్టర్‌లను పరిశీలించారు. అధికారులు, సిబ్బంది నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ రిజ్వాన్ బాషా