
వైద్యసిబ్బంది అందుబాటులో ఉండాలి
జనగామ రూరల్: వర్షాల నేపఽథ్యంలో ప్రజలకు వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండి సేవలు అందించాలని డీఎంహెచ్‌ఓ మల్లికార్జునరావు అన్నారు. బుధవారం మండలంలోని ఓబుల్‌కేశవాపూర్ గ్రామంలో పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్యులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. గర్భిణుల అంచనా ప్రసవ తేదీల రిజిస్టర్‌ను పరిశీలించి వర్షాలు అధికంగా కురుస్తున్న నేపథ్యంలో సకాలంలో ప్రసవ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అవుట్ పేషెంట్ రిజిస్టర్, రికార్డులను పరిశీలించి అవుట్ పేషెంట్‌తో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి, అందుతున్న సేవలు అడిగి తెలుసుకున్నారు. ల్యాబ్ రిజిస్టర్‌ను పరిశీలించి, నర్సింగ్ ఆఫీసర్, ఏఎన్‌ఎంలకు తగు సూచనలు ఇచ్చారు. అన్ని సబ్ సెంటర్లలో అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో పీహెచ్‌సీ స్థాయిలో 72 గంటలపాటు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ మల్లికార్జునరావు