
ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి
రఘునాథపల్లి: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని డీసీపీ రాజమహేంద్రనాయక్ అన్నారు. బుధవారం మండలంలోని బానాజీపేటలో కాజ్‌వేపై ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును సీఐ ఎడవెల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సై దూదిమెట్ల నరేష్‌తో కలిసి ఆయన పరిశీలించారు. కాజ్‌వే కోతకు గురవుతున్నందున ప్రమాదాలు చోటు చేసుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పంచాయతీ సిబ్బందికి సూచించారు. అలాగే మండల కేంద్రంలోని సబ్‌స్టేషన్ వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును పరిశీలించారు.కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రచ్చ సోమనాథ్, పంచాయతీ కార్యదర్శి ఆక్తర్, కారోబార్ మల్లేష్ తదితరులు ఉన్నారు.
డీసీపీ రాజమహేంద్రనాయక్