
మహిళా సంఘాలను బలోపేతం చేయాలి
● ఐకేపీ డీపీఎం శ్రీనివాస్
దేవరుప్పుల: అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతో ప్రత్యేక అవసరాల వారి సంక్షేమం కోసం కొత్త స్వ యం సహాయక సంఘాలను బలోపేతం చేయాల ని ఐకేపీ డీపీఎం శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతువేదికలో చందన మండల సమాఖ్య ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 సోషల్ మొ బిలైజేషన్‌పై గ్రామైఖ్య సంఘాల పాలకవర్గం, ఐకేపీ వీఓఏలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని కిశో ర బాలికలు, వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక సంఘాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో ఏపీఎం శోభారాణి, సమాఖ్య అధ్యక్షురాలు పులిపంపుల మమత, మునిగొడం శారద, చిక్కుడు శైలజ, సీసీలు సోమనారాయణ, శంకర్, ఉమ తదితరులు పాల్గొన్నారు.