
అర్హులైన ప్రతిఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు
కొడకండ్ల: సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో అర్హులైన ప్రతీఒక్కరికి ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేస్తూ పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నామని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. సోమవారం మండలకేంద్రంలోని రైతు వేదికలో మండలంలోని 84 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ గృహాల మంజూరు పత్రాలను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో నిరుపేదలు సొంతింటి కలను సాకారం చేసుకోలేకపోయారన్నారు. తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నేర వేరుస్తూ పేదల సంక్షేమానికి కృషి చేస్తున్నామని, అర్హులైన ప్రతిఒక్కరికి ఇండ్లు, రేషన్‌కార్డులు అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సురేష్‌నాయక్, మార్కెట్ వైస్ చైర్మన్ సాయికృష్ణ, నియోజకవర్గ, మండల యూత్ అధ్యక్షుడు రాజేష్‌నాయక్, యాకేష్‌యాదవ్, పట్టణ అధ్యక్షుడు రవీందర్, వెంకట్‌రెడ్డి, వెంకన్న, అంజయ్య, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.
నులిపురుగు రహిత సమాజాన్ని
నిర్మించుకోవాలి
పాలకుర్తి టౌన్: 19 సంవత్సరాల పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు వేసి నులిపురుగు రహిత సమాజాన్ని నిర్మించుకోవాలని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. సోమవారం మండలకేంద్రంలోని కేజీబీవీలోని విద్యార్థినులకు ఆల్బెండజోల్ మాత్రల ను వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడా రు. విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. అంతకుముందు పాఠశాలలో నిర్వహించిన తీజ్ వేడుకలో పాల్గొన్నారు. వైద్యాధికారులు సిద్ధార్థరెడ్డి, స్వప్న, ఎంపీడీఓ రవీందర్, ఎంఈఓ నర్స య్య, తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలి
వర్షాకాలంలో విద్యుత్ సమస్యలు రాకుండా చూడాలని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. సోమవారం మండలకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని తొర్రూరు, పెద్ద వంగ ర, దేవరుప్పుల మండలాల విద్యుత్ శాఖ డీఈలు, ఏడీలు, ఏఈలతో సమీక్ష నిర్వహించారు.
ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి