
అదుపు తప్పి ధాన్యం లారీ బోల్తా
బచ్చన్నపేట: జనగామ, సిద్దిపేట రహదారి మండలంలోని కొడవటూర్ కమాన్ సమీపంలో ప్రమాదవశాత్తు ధాన్యం లారీ బోల్తా పడిన సంఘటన సోమవారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. కామారెడ్డి నుంచి ధాన్యం లోడుతో ఏపీ రాష్ట్రం తణుకు వెళ్తున్న లారీ కొడవటూర్ కమాన్ సమీపంలోకి రాగానే అధిక స్పీడ్‌తో పాటు గుంతలమయంగా ఉన్న రోడ్డు కారణంగా లారీ కమాన్ పట్టీలు విరిగిపోయాయి. దీంతో లారీ రోడ్డుపై బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ చెన్నారావుకు స్వల్పగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఎస్సై ఎస్‌కే అబ్దుల్ హామీద్ అక్కడికి చేరుకుని జేసీబీ సాయంతో లారీని పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేయించారు. కమాన్ సమీపంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, అధికారులు గుంతల రోడ్డును బాగు చేయాలని కోరుతున్నారు.