రిజర్వాయర్ల పనులు త్వరగా పూర్తిచేయాలి
పాలకుర్తి టౌన్: పాలకుర్తి, చెన్నూరు రిజర్వాయర్ల పనులు త్వరగా పూర్తిచేయాలని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి నీటిపారుదల శాఖ అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. బుధవారం మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం పాలకుర్తి రిజర్వాయర్ పనులను పరిశీలించారు. పాలకుర్తి, చెన్నూరు రిజర్వాయర్ పనుల తక్షణ సమాచారం కోరుతూ ప్యాకేజ్ 6 వివరాలను తెలుసుకున్నారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే పనులు ముగించాలని ఆదేశించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, నీటిపారుదల శాఖ ఎస్‌ఈ సుధీర్, ఈఈలు ప్రవీణ్, సీతారాం, డీఈలు శ్రీకాంత్ శర్మ, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి


