
వైభవంగా అష్టదళ పాద పద్మారాధన
చిల్పూరు: బుగులు వేంకటేశ్వరస్వామి సన్నిధిలో మంగళవారం భక్త జనసందోహం నడుమ ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్‌రావు, కిరణ్మయి దంపతుల ఆధ్వర్యంలో అష్టదళ పాద పద్మారాధన పూజ వైభవంగా నిర్వహించారు. భక్తుల సమక్షంలో 108 బంగారు పుష్పాలు, వెండి పాదపద్మాలను అర్చకులు రవీందర్‌శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యుల వేద మంత్రాల నడుమ స్వామివారి ముందు ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ లక్ష్మిప్రసన్న, జూనియర్ అసిస్టెంట్ కుర్రెంల మోహన్, వీరన్న, భక్తులు పాల్గొన్నారు.
లారీలు రాకుంటే సమాచారమివ్వండి
డీసీపీ రాజమహేంద్రనాయక్
రఘునాథపల్లి: లారీలు సకాలంలో రాకుంటే తమకు సమాచార అందించాలని, కొనుగోలు కేంద్రానికి పంపించే ఏర్పాట్లు చేస్తామని డీసీపీ రాజమహేంద్రనాయక్ తెలిపారు. మంగళవారం మండలంలోని నిడిగొండ పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రికార్డులు, నిల్వ ఉన్న ధాన్యం వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ధాన్యం కొనుగోల్లు వేగవంతం చేయాలన్నారు. తూకంలో తేడా ఉండొద్దన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్ధతు ధర పొందాలన్నారు. ఆయన వెంట జనగామ రూరల్ సీఐ ఎడవెల్లి శ్రీనివాస్‌రెడ్డి, సొసైటీ సీఈఓ అఖిల్, రైతులు మాసంపల్లి సంతోజి, నేతాజీ, పెసరు నాగరాజు తదితరులు ఉన్నారు.
క్రీడలతో మానసికోల్లాసం
డీఈఓ భోజన్న
జనగామ రూరల్: క్రీడలతో విద్యార్థులకు శారీరక మానసిక పెరుగుదలతో పాటు నైపుణ్యాల అభివృద్ధి అవుతాయని డీఈఓ భోజన్న అన్నారు. మంగళవారం మండలంలోని కేజీబీవీ పాఠశాలలో జిల్లా అవాస వేసవి క్యాంప్‌ను డీఈఓ భోజన్న, జీసీడీఓ గౌసియా ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలికలను ఉద్దేశించి మాట్లాడుతూ క్రీడల్లో రాణిస్తే భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతను వివరించారు. గౌసియా మాట్లాడుతూ సాంస్కృతిక, విద్యాపరమైన అంశాల్లో ప్రతిభ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ రజిత, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి శిక్షణను
జయప్రదం చేయాలి
జనగామ రూరల్: న్యాయవాదులు తమ వృత్తి నైపుణ్యతను పెంపొందించుకోవాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) ఆధ్వర్యంలో మే 10, 11 తేదీల్లో మంచిర్యాలలో నిర్వహించే రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులకు న్యాయవాదులు హాజరై జయప్రదం చేయాలని జిల్లా నాయకులు గాజుల రవీందర్ తెలిపారు. మంగళవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో శిక్షణ తరగతుల కరపత్రాలను న్యాయవాదులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ న్యాయవాదులు తమ వృత్తి నైపుణ్యతను పెంపొందించుకుంటేనే రాణించగలుగుతారన్నారు. ఈ శిబిరంలో ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్, ఆర్ట్ ఆఫ్ క్రాస్ ఎగ్జామినేషన్, ప్లీడింగ్ అండ్ డ్రాప్టింగ్స్, నూతన చట్టాలపై అవగాహన కల్పించడం జరుగుతందన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు దండబోయిన యుగేందర్, అశోక్ వర్ధన్‌రెడ్డి, బద్రీనాథ్, బిట్ల గణేష్, వై.భిక్షపతి, సీహెచ్. చంద్రశేఖర్, జి.అమృత రావు, బి.మధుసూదన్, ఎండీ.జమాల్ షరీఫ్, జి.నర్శింహులు, ప్రశాంత్, రవి, కవిత, రేఖ తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా అష్టదళ పాద పద్మారాధన

వైభవంగా అష్టదళ పాద పద్మారాధన

వైభవంగా అష్టదళ పాద పద్మారాధన