ప్రభుత్వాస్పత్రుల్లో కాన్పులు జరిగేలా చూడాలి
చిల్పూరు: ప్రభుత్వాస్పత్రుల్లో అన్ని వసతులు ఉన్నా.. చాలా మంది పేదలు విషయం తెలియక అనవసర ఖర్చులతో ఆపరేషన్లు చేయించుకుంటున్నారని, ఇక నుంచి ప్రభుత్వాస్పపత్రుల్లోనే కాన్పులు జరిగేలా సిబ్బంది పాటుపడాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. మల్కాపూర్‌లోని పీహెచ్‌సీని గురువారం మధ్యాహ్నం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా డాక్టర్ కుశాలితో మాట్లాడుతూ.. నార్మల్ డెలివరీ ఉన్నప్పటికీ ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు డబ్బుల కోసం ఆపరేషన్ల పేరిట రోగుల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారన్నారు. ఇక నుంచి డెలివరీకి ఉన్న వారిని గుర్తించి ప్రభుత్వాస్పత్రుల్లోనే చేర్పించేలా చూడాలన్నారు. అనంతరం చిల్పూరు, మల్కాపూర్, రాజవరం ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట మండల ప్రత్యేకాధికారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మాధవీలత, తహసీల్దార్ సరస్వతి, ఎంపీఓ మధుసూదన్, ఏఈఓలు నరసింహులు, వినయ్, యాకూబ్ తదితరులు ఉన్నారు.
కలెక్టర్‌ను కలిసిన డీఈఓ
జనగామ రూరల్: నూతనంగా డీఈఓగా బాధ్యతలు స్వీకరించిన భోజన్న గురువారం కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌ను మార్యాదపూర్వకంగా కలిశారు. పూల మొక్క అందజేశారు. ఆయన వెంట ఏపీఓ రమేశ్ ఉన్నారు.
కలెక్టర్ రిజ్వాన్ బాషా
పీహెచ్‌సీ ఆకస్మిక తనిఖీ
ప్రభుత్వాస్పత్రుల్లో కాన్పులు జరిగేలా చూడాలి


