పేదల సంక్షేమమే ధ్యేయం
పాలకుర్తి టౌన్/కొడకండ్ల: కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనలో ప్రతీ ఇంటా సంక్షేమం అందించడమే ధ్యేయమని ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. శనివారం పాలకుర్తి, కొడకండ్ల మండల కేంద్రాల్లో వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతిఒక్కరికీ అందేలా పూర్తి పారదర్శకతతో ఆర్థిక సహాయం అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్ధార్లు సుత్రం సరస్వతి, చంద్రమోహన్, మా ర్కెట్ చైర్‌పర్సన్ లావుడ్యి మంజుల, మండల అధ్యక్షులు గిరగాని కుమారస్వామి, సురేష్ నాయక్, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
సీనియర్ సిటిజన్స్‌కు
ప్రత్యేక హక్కులు కల్పించాలి
దేవరుప్పుల: సీనియర్ సిటిజన్స్‌కు ప్రత్యేక హ క్కులను కల్పించాలని ఆల్ ఇండియా సీని యర్ సిటిజన్స్ అసోసియేషన్ (ఏఐఎస్‌సీఏ) జిల్లా అధ్యక్షుడు తీగల సిద్దిమల్ల య్య డిమాండ్ చేశారు. శనివారం మండలకేంద్రంలో అక్షర గార్డెన్‌లో సీనియర్ సిటిజన్స్ ప్ర త్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అపరిష్కృత సమస్య ల పరిష్కారానికి ప్రభుత్వాలు చొరవ చూపాలన్నారు. అనంతరం అడహాక్ కమిటీ కన్వీనర్‌గా ఉప్పల రమేశ్‌తో పాటు మరికొంతమందిని ఎన్నుకున్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి అల్లాడి ప్రభాకర్‌రావు, కోశాధికారి వనమాల రమేష్, మహమ్మద్ ఆజాంఅలీ, పెద్దాపురం వెంకటేశ్వర శర్మ, బుక్క రామయ్య పాల్గొన్నారు.
పాలకుర్తి టౌన్: సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శనివారం హైకోర్టు రిజిస్ట్రార్ డి.రవీంద్రశర్మ, సురేఖ దంపతులు స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా హైకోర్టు రిజిస్టర్ దంపతులకు అర్చకులు స్వామి వారి శేషవస్తాలతో సన్మానించి స్వామి వారి ప్రసాదాన్ని అందించారు. అలాగే జనగామ ఆర్డీఓ గోపిరామ్ దంపతులు స్వామిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ భాగం లక్ష్మీప్రసన్న, ఆ లయ ప్రధాన అర్చకులు దేవగిరి లక్ష్మన్న, డీవీ ఆర్‌శర్మ, తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ ప్రమాదాలకు దూరంగా ఉండండి
జనగామ: సంక్రాంతి పండుగ వేళ విద్యుత్ ప్రమాదాల నివారణకు ప్రతిఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని ఎన్పీడీసీఎల్ జనగామ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్‌ఈ) చెరుకు సంపత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గాలిపటాలు ఎగురవేయ డం ఆనవాయితీ అయినప్పటికీ, విద్యుత్ లైన్ల సమీపంలో నిర్లక్ష్యం ప్రాణాంతకమయ్యే అవకాశముందన్నారు. విద్యుత్ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్ స్టేషన్ల సమీపంలో పతంగులు ఎగురవేయవద్దన్నారు. చైనా మాంజా వాడకాన్ని పూర్తిగా నివారించాలన్నారు. గాలిపటం విద్యుత్ తీగలకు చిక్కితే కర్రలు, ఇనుప పైపులు ఉపయోగించి తీసే ప్రయత్నం చేయకూడదని హెచ్చరించారు. వైర్లు తెగిపోయి కింద పడితే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1912కు స మాచారం ఇవ్వాలని సూచించారు. నిబంధనలు పాటిస్తూ పండుగను జరుపుకోవాలన్నారు.
పాలకుర్తి టౌన్: మండలంలోని బమ్మెర శివారులోని ఆలేటి ఎల్లవ్వ జాతర వేలం ఆదాయం రూ.1,03,000 వచ్చినట్లు సర్పంచ్ జిట్టబోయి న రమ్య తెలిపారు. శనివారం గ్రామ పంచాయతీ ఆవరణలో వేలం పాటలు నిర్వహించారు. ఇందులో కొబ్బరికాయల విక్రయానికి రూ.70వేలు, వాహనాల పార్కింగ్‌కు రూ.18వేలు, దుకాణాలు రూ.7వేలు, లడ్డూ, పులిహోర ప్రసాదానికి రూ.3,500ల ఆదాయం వచ్చి నట్లు సర్పంచ్ తెలిపారు.
పేదల సంక్షేమమే ధ్యేయం
పేదల సంక్షేమమే ధ్యేయం


