సంక్రాంతి రద్దీ
జనగామ: సంక్రాంతి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 10 నుంచి 16వ తేదీ వరకు సెలవులు ప్రకటించింది. ఈ నేపథ్యంలో జనగామ బస్టాండ్‌లో ప్రయాణికులు, విద్యార్థులతో రద్దీగా మారింది. రద్దీకి అనుగుణంగా జనగామ ఆర్టీసీ డిపో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్ ఉప్పల్‌కు రోజుకు 15 స్పెషల్ బస్సులను 45 ట్రిప్పులుగా నడుపుతోంది. అవసరాన్ని బట్టి మరిన్ని బస్సులు పెంచే అవకాశం ఉందని డిపో మేనేజర్ వెల్లడించారు. సాధారణంగా రోజు వారీగా 46 వేల కిలోమీటర్లు తిరిగే బస్సులు రూ.24 లక్షల పైచిలుకు కలెక్షన్ రావాలని అంచనా వేసింది. పండుగ సమయంలో ఈ కలెక్షన్ 20 నుంచి 30శాతం పెరిగే అవకాశం ఉండనుంది. ప్రస్త్తుం 58 వేల మంది ప్రయాణికులు ఆర్టీసీ సేవలు వినియోగించుకుంటుండగా పండుగ సమీపిస్తున్న కొద్దీ ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా.
స్వగ్రామాలకు కుటుంబాలు
పండుగ సెలవుల నేపథ్యంలో ప్రభుత్వ విద్యాసంస్థలు జనవరి 10 నుంచి సెలవులు ఇవ్వడంతో సుదూర ప్రాంతాలకు వలస వెళ్లిన కుటుంబాలు స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. దీంతో జనగామ ఆర్టీసీ బస్టాండ్‌లో రద్దీ పెరిగిపోయింది. ప్లాట్ ఫాంలు ప్రయాణికులతో నిండిపోతున్నాయి. రద్దీ సమయంలో ప్రయాణికులు ఇబ్బంది పడకుండా డీఎం నేతృత్వంలో ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. పోలీసులు కూడా పెద్ద ఎత్తున నిఘా ఏర్పాటు చేశారు.
అదనపు చార్జీలు..
పండుగ కారణంగా స్పెషల్ బస్సుల టికెట్లపై 50శాతం అదనపు చార్జీలు వసూలు చేస్తుండడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, ఇవి కేవలం పండుగ రోజులకు మాత్రమే వర్తిస్తాయని అధికారులు స్పష్టం చేశారు. రద్దీ కారణంగా జనగామ నుంచి ఉప్పల్, సిద్దిపేట, బచ్చన్నపేట, హనుమకొండ, వరంగల్ వంటి ప్రధాన మార్గాల్లో ప్రయాణికులు ఒంటికాలు మీద ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బస్టాండ్‌కు చేరుకున్న విద్యార్థులు
ఆర్టీసీకి టికెట్ కలెక్షన్లు
కిక్కిరిసిన జనగామ బస్టాండ్
ఉప్పల్‌కు అదనంగా 15 బస్సులు,
45 ట్రిప్పులు
సంక్రాంతి రద్దీ
సంక్రాంతి రద్దీ


