ఖాకీల కారుణ్యం! | - | Sakshi
Sakshi News home page

ఖాకీల కారుణ్యం!

Jan 11 2026 7:41 AM | Updated on Jan 11 2026 7:41 AM

ఖాకీల

ఖాకీల కారుణ్యం!

ఖాకీల కారుణ్యం!

● ఇటీవల మిల్స్‌కాలనీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు డయల్‌ 100కు కాల్‌ వచ్చింది. మిల్స్‌కాలనీ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న హెడ్‌ కానిస్టేబుల్‌ ఉస్మాన్‌, కానిస్టేబుల్‌ నరేశ్‌ వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకుని యువకుడి ప్రాణాలు కాపాడారు.

● ఇటీవల నర్సంపేటకు చెందిన ఓ యువతి ప్రేమ విఫలమైందని ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. బస్టాండ్‌ వద్ద అనుమానం వచ్చి ఆ విషయాన్ని పసిగట్టిన బ్లూకోల్ట్స్‌ సిబ్బంది ఇన్‌స్పెక్టర్‌ మచ్చ శివకుమార్‌ దగ్గరికి తీసుకెళ్లారు. ఆయన కౌన్సెలింగ్‌ ఇచ్చి జీవితం గొప్పదనాన్ని తెలిపి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

● రాయికల్‌కు చెందిన ఓ యువతిని సైతం బ్లూకోల్ట్స్‌ సిబ్బంది కాపాడి కౌన్సెలింగ్‌ నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు.

● కాజీపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధి వడ్డేపల్లి చెరువు కట్టపై ఓ వివాహిత ఆత్మహత్యకు యత్నించింది. పోలీసులు సకాలంలో స్పందించి కౌన్సెలింగ్‌ ఇవ్వడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది.

● అదేవిధంగా తల్లిదండ్రులు మందలించారని మనస్తాపానికి గురైన ఓ యువతి ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసి ఇంట్లోంచి వెళ్లి ఆత్మహత్యకు యత్నిస్తుండగా హనుమకొండ పోలీసులు కాపాడారు.

● ధర్మసాగర్‌కు చెందిన పల్లెపు శ్రీనివాస్‌ మడికొండ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అయోధ్యపురం రైల్వే ట్రాక్‌పై పడుకుని ఆత్మహత్యకు యత్నించాడు. రైల్వే కీమెన్‌ వేణు, సహకారంతో పోలీసులు అతడి ప్రాణాలు కాపాడారు.

● ఈనెల 5న (గత సోమవారం) గౌసియాబేగం అనే మహిళ తన మూడేళ్ల పాపతో మండిబజార్‌ ఏరియాలో నడిచి వెళ్తుండగా లోబీపీతో పడిపోయింది. అక్కడే విధుల్లో ఉన్న ఇంతేజార్‌గంజ్‌ ఎస్సై వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి మహిళను పోలీస్‌ వాహనంలో ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

ప్రకృతి వైపరీత్యాలైనా. సభలు, సమావేశాలైనా.. పండుగైనా పబ్బమైనా మీ రక్షణ కోసమే మేమున్నాం అంటున్నారు పోలీసులు. ఆపత్కాలంలో ముందు వరుసలో నిలబడి సేవలందిస్తున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు నడవ లేని వృద్ధులను ఎత్తుకొని పోలింగ్‌ బూత్‌లకు తీసుకొచ్చారు. ఉమ్మడి జిల్లాలో భారీగా కురిసిన వర్షాలకు వరదలు ముంచెత్తి ఇళ్లలో చిక్కుకున్న వృద్ధులను, పిల్లలను కాపాడారు. విజిబుల్‌ పోలీసింగ్‌ నిర్వహిస్తున్న బ్లూకోల్ట్స్‌ సిబ్బంది.. ఆత్మహత్య వైపు అడుగులు వేస్తున్న ఎంతో మందిని కాపాడి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.

పోలీస్‌ వాహనంలో తరలించి.. ప్రాణాలు నిలబెట్టి

మడికొండ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట డివైడర్‌ను బైక్‌ ఢీకొట్టిన ఘటనలో యువకులు సాయిరాం, ఆకుల శశాంక్‌కు తీవ్ర రక్తస్రావమైంది. రోడ్డుపై పడి కొట్టుకుంటుండగా ఇన్‌స్పెక్టర్‌ పుల్యాల కిషన్‌ తన వాహనంలో బాధితులను ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాణాలు కాపాడారు. రక్తపు మడుగులో పడి ఉన్న యువకులను చూసి స్థానికులెవ్వరూ ముందుకు రాలేదు. పోలీసులు చేసిన ఆ సేవ సోషల్‌ మీడియాలో వైరలైంది.

ఆత్మహత్యలను అడ్డుకుంటూ.. ప్రాణాలను నిలబెడుతూ

మిల్స్‌ కాలనీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వినాయకుడి నిమజ్జనం సమయంలో ఉర్సుగుట్టకు నిమజ్జనానికి వచ్చిన ఓ యువకుడు ట్రాక్టర్‌లో చేతులు కాళ్లు కొట్టుకుంటూ నురుగులు కక్కాడు. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ఎస్సై శ్రవణ్‌, కానిస్టేబుల్‌ చందు ఆ యువకుడిని ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు.

కౌన్సెలింగ్‌ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగింత

విపత్తులు, ప్రమాదాల సమయంలోనూ మేమున్నామంటూ..

ఆపద్బాంధవులుగా.. ఓరుగల్లు పోలీసులు

వీరి సేవలకు సలాం అంటున్న ప్రజలు

పసిగట్టి..

ప్రాణాలు

కాపాడి

ఖాకీల కారుణ్యం!1
1/2

ఖాకీల కారుణ్యం!

ఖాకీల కారుణ్యం!2
2/2

ఖాకీల కారుణ్యం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement