టెన్త్‌ ఫలితాల్లో ఎస్‌ఆర్‌ విజయభేరి | - | Sakshi
Sakshi News home page

టెన్త్‌ ఫలితాల్లో ఎస్‌ఆర్‌ విజయభేరి

May 1 2025 1:11 AM | Updated on May 2 2025 2:38 PM

విద్యారణ్యపురి: టెన్త్‌ పరీక్షల ఫలితాల్లో ఎస్‌ఆర్‌ విద్యాసంస్థల విద్యార్థులు విజయభేరి మోగించారని ఆ విద్యాసంస్థల చైర్మన్‌ ఎ.వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి తెలిపారు. సక్కరా శివప్రియ 600 మార్కులకు గాను 586, డి.దీక్షిత్‌రెడ్డి 586, ఎస్‌.మనస్విని 585, మనివర్ధన్‌ 584, శివచరణ్‌ 584, వి.హాసిని 584 మార్కులు సాధించారని వారు తెలిపారు. 580కి పైగా మార్కులు 23మందికిపైగా సాధించి తమ ప్రతిభను చాటారన్నారు. 

ప్రస్తుత పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు విద్యావ్యవస్థలో వస్తున్న మార్పులను గమనిస్తూ వాటిని ఆచరణ పరుస్తూ ఒత్తిడి లేని వాతావరణంలో క్రమశిక్షణ, సృజనాత్మకతతో కూడిన విద్యను అందిస్తున్నామన్నారు. ఎస్‌ఆర్‌ విద్యాసంస్థల్లో పోటీ పరీక్షలను ఎదుర్కొనే విధంగా ఎస్సెస్సీ విద్యార్థులకు ఐఐటీ, మెడికల్‌ ఫౌండేషన్‌లో ఎక్కువ శ్రద్ధ తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైమ్‌ స్కూల్స్‌ను ప్రారంభించామన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement