
ఆలకించి.. ఆదేశించి
జనగామ రూరల్: ‘అనారోగ్యంతో భర్త చేనిపోయాడు. ఇద్దరు పిల్లలున్నారు. పోషణ ఇబ్బందిగా మారింది. వితంతు పింఛన్ రావడంలేదని ఓ మహిళ.. తమ తండ్రి కొనుగోలు చేసిన భూమిని కొందరు ఆక్రమించారు. న్యాయం చేయాలని ఇద్దరు రైతులు.. పక్కన ఉన్న భూమి యజమానుల కారణంగా ఆయిల్‌పామ్ తోటకు నిప్పంటుని నష్టపోయాను. ఆదుకోవాలని ఓ రైతు’.. ఇలా అనేక సమస్యలతో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు అధికారులకు మొరపెట్టుకున్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌కు 58 అర్జీలు రాగా.. వాటిని స్వీకరించిన అదనపు కలెక్ట ర్లు రోహిత్‌సింగ్, పింకేష్‌కుమార్.. వారి సమస్యల ను ఓపికగా విన్నారు. సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రీవెన్స్‌లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌లు సుహాసిని, హనుమాన్ నాయక్, ఆర్డీఓ వెంకన్న, కలెక్టరేట్ ఏఓ మన్సూర్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
అర్జీల్లో కొన్ని ఇలా..
● తన వ్యవసాయ భూమికి సంబంధించిన సమస్య పరిష్కారం కావడం లేదు.. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని పాలకుర్తి మండలం ఈరవెన్ను గ్రామానికి చెందిన మహిళా రైతు ఆలేటి ఎల్లమ్మ అర్జీ పెట్టుకుంది.
● తాను ఒంటరి మహిళను. రాజీవ్ యువ వికాసం పథకం కింద ఏదైనా ఉపాధి కల్పించాలని రఘునాథపల్లి మండలానికి చెందిన అంబిక దరఖా స్తు చేసుకున్నది.
● తన భూమిని ఆక్రమించుకున్నారని, వారిపై చర్య తీసుకోవాలని బచ్చన్నపేట మండలం దబ్బగుంటపల్లికి చెందిన నరేందర్‌రెడ్డి వినతి పత్రం అందజేశాడు.
వితంతు పింఛన్ ఇప్పించండి
ఐదేళ్ల క్రితం భర్త బత్తిని వెంకటేశ్వర్లు అనారోగ్యంతో మృతి చెందాడు. మాకు ఇద్దరు పిల్లలు. పోషణకు ఇబ్బంది పడుతున్నా ను. గ్రామంలో కూలీ పనులు చేసి పిల్లలను చదివిస్తున్నాను. ఎలాంటి ఆస్తులు లేవు. సొంత ఇల్లు లేక అద్దెకు ఉంటున్నాను. వితంతు పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలి.
– బత్తిని లత, రాఘవాపూర్(స్టేషన్‌ఘన్‌పూర్)
సర్వే చేయించి భూమిని కాపాడాలి
మా తండ్రి భీమగోని చంద్రయ్య 50 ఏళ్ల క్రితం భూమి కొనుగోలు చేశాడు. ప్రస్తుతం ఖాస్తులో ఉండగా హైదరాబాద్‌కు చెందిన పేర్వారం రాధిక మా పట్టా భూమిలో వారి భూమి ఉందని 1.30 గుంట లు అక్రమంగా చదువు చేసి ఆక్రమించారు. సర్వే చేయించి భూమిని కాపాడాలి.
– భీమగోని ప్రవీణ్‌కుమార్, శ్రావణ్‌కుమార్, ఖిలాషాపురం(రఘునాథపల్లి)
తోట కాలింది.. ఆదుకోండి
రఘునాథపల్లి మండలం కోమళ్లలో 4.38 గుంటల భూమిలో మూడేళ్ల క్రితం ఆయిల్‌పామ్ సాగు చేసిన. తోట పక్కన ఉన్న యజమానులు వారి భూమిని చదునుచెసి కంపచెట్లను తొలగించి వారం కింద నిప్పు పెట్టారు. రెండుసార్లు మంటలు ఆర్పేసిన. ఆదివారం మధ్యాహ్నం నిప్పుపెట్టిన కంపచెట్ల నుంచి మంటలు వ్యాపించి ఆయిల్‌పామ్ తోట కాలిపోయింది. రూ.10లక్షల వరకు పెట్టుబడి పెట్టిన. తోట కాలింది.. ఆదుకోండి.
– బత్తోజు ఆంజనేయులు, జనగామ పట్టణం
అర్హులకు న్యాయం చేయాలి
గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధి దారుల ఎంపిక సక్రమంగా జరగడంలేదు. గతంలో ఆస్తులు, ఆర్థికంగా ఉన్నవారి పేర్లు కూడా జాబితాలో ఉన్నాయి. అధికారులు విచారణ చేపట్టి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ సజావుగా చేపట్టి అర్హులకు న్యాయం చేయాలి.
– ముక్క కుమారస్వామి, చౌడారం (జనగామ)
గ్రీవెన్స్‌లో ప్రజల గోడు
వివిధ సమస్యలపై 58 అర్జీలు
స్వీకరించిన అదనపు కలెక్టర్లు
తక్షణమే పరిష్కరించాలని ఆదేశం

ఆలకించి.. ఆదేశించి

ఆలకించి.. ఆదేశించి

ఆలకించి.. ఆదేశించి

ఆలకించి.. ఆదేశించి