
విలువల పరిరక్షణలో కవులు ముందుండాలి
● కవి, గాయకుడు పెట్లోజు సోమేశ్వరాచారి
జనగామ: మానవీయ విలువల పరిరక్షణలో కవులు ముందుండాలని కవి హృదయం సాహిత్య వేది క వ్యవస్థాపకుడు, కవి గాయకుడు పెట్లోజు సోమేశ్వరాచారి అన్నారు. పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ జనగామ కవులు సోమవారం స్థానిక స్కాలర్ గ్రామర్ స్కూల్‌లో కవి హృదయం సాహిత్య వేదిక, కవులు, కళాకారుల ఐక్య వేదిక, సాధిక్ ఫౌండేషన్ ఆధ్వర్యాన నిర్వహించిన కవి సమ్మేళనాన్ని సాధిక్ అలీ ప్రారంభించి మాట్లాడారు. సమ సమాజ స్థాపనలో ప్రతి ఒక్కరూ ఐక్యతను చాటాలని కోరారు. అంతకు ముందు ఉగ్రదాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతికలగాని రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. కవులు మాన్యపు బుజేందర్, అంకాల సోమయ్య, చిలుమోజు సాయికిరణ్, రంగరాజు ప్రసాద్, కవులు, కళాకారుల ఐక్య వేదిక అధ్యక్షుడు జి.కృష్ణ, లగిశెట్టి ప్రభాకర్, సాంబ రాజు యాదగిరి, నక్క సురేష్, పొట్టబత్తిని భాస్కర్, గడ్డం మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.