ఉగ్రవాదాన్ని అంతమొందించాలి
పాలకుర్తి టౌన్ : ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అంతమొందించాలని మహాత్మా హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు గంటా రవీందర్, డాక్టర్ కల్నల్ మాచర్ల భిక్షపతి అన్నారు. ఉగ్రదాడులకు నిరసనగా ఆదివారం రాత్రి పాలకుర్తి మండల కేంద్రం గుడివాడ చౌరస్తా నుంచి రాజీవ్ చౌరస్తా వరకు కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు పాకిస్తాన్‌కు తగిన గుణపాఠం చెప్పి తీరుతామని హెచ్చరించారు. ఉగ్రవాదుల దాడిలో మృతిచెందిన అమరుల ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ కొవ్వొత్తులతో ప్రదర్శన చేపట్టారు. కార్యక్రమంలో ఎంఈఓ పోతుగంటి నర్సయ్య, తండ మల్లయ్య, కిరాణ వర్తక వ్యాపార సంఘం అధ్యక్షుడు చారగొండ్ల ప్రసాద్, పన్నీరు సారంగపాణి, ఇమ్మడి అశోక్, భోనగిరి కృష్ణమూర్తి, కమ్మగాని శ్రీకాంత్, మారం రవి, గుమ్మడిరాజు సాంబయ్య పాల్గొన్నారు.
కొవ్వొత్తులతో ప్రదర్శన
జఫర్‌గఢ్ : పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మశాంతికి ఆర్యవైశ్యులు ఆదివారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించా రు. గాంధీ సెంటర్ నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ప్రదర్శన చేపట్టారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు అంచూరి యుగంధర్, నాయకులు దాంశెట్టి సోమన్న, ఇమ్మడి ఆశోక్, గందె సోమన్న, శ్రవణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పహల్గాం మృతులకు కొవ్వొత్తులతో శాంతిర్యాలీ
ఉగ్రవాదాన్ని అంతమొందించాలి


