ప్రధాన న్యాయమూర్తిగా ప్రతిమ బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

ప్రధాన న్యాయమూర్తిగా ప్రతిమ బాధ్యతల స్వీకరణ

Apr 24 2025 8:25 AM | Updated on Apr 24 2025 8:25 AM

ప్రధా

ప్రధాన న్యాయమూర్తిగా ప్రతిమ బాధ్యతల స్వీకరణ

జనగామ రూరల్‌: జిల్లా ప్రధాన న్యాయమూర్తి గా డి.ప్రతిమ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. జనగామలో పనిచేసిన డి.రవీంద్రశర్మ హైకోర్టుకు బదిలీ కాగా కరీంనగర్‌ కోర్టులో విధులు నిర్వర్తిస్తున్న ప్రతిమ ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా సీనియర్‌ సివిల్‌ జడ్జిలు సి.విక్రమ్‌, సుచరిత, జూనియర్‌ సివిల్‌ జడ్జిలు జి.శశి, కె.సందీప జిల్లా కోర్టులో ఆమెకు మొక్క అందజేసి స్వాగతం పలికారు. జనగా మ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు డి.హరిప్రసాద్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇమ్యునైజేషన్‌

లక్ష్యం చేరుకోవాలి

జనగామ: జిల్లాలో ఇమ్యునైజేషన్‌ నూరుశాతం లక్ష్యం చేరుకోవాలి.. ఇందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ మల్లికార్జున్‌రావు అన్నారు. ఆరోగ్య కార్యాక్రమాలపై బుధవారం జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు, వైద్య అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇమ్యునైజేషన్‌ సెషన్లు, ఆరోగ్య సూచిక డేటాలను ఎప్పటికప్పుడు యూ–విన్‌, ఎంసీహెచ్‌ కిట్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలన్నారు. శశక్త్‌ పోర్టల్‌లో ఏబీహెచ్‌ఏ ఐడీ లింకేజీ వందశాతం నమోదు చేయాలని సూచించారు. పీహెచ్‌సీల్లో కల్పించే సదుపాయాలను మహిళలకు వివరించి డెలివరీలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పా రు. ఏఎన్‌సీ రిజిస్ట్రేషన్ల శాతంలో 3, 4వ చెకప్‌ ల ఫాలోఅప్‌లు పెంచడానికి వైద్య సిబ్బంది పర్యవేక్షించాలన్నారు. ముఖ్యంగా గర్భస్రావ మరణాలు తగ్గించడంపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. అనంతరం కుక్క, పాము కాటుకు గురైన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వైద్య సహాయం తదితర వివరాలతో రూపొందించిన పోస్టర్‌ ఆవిష్కరించారు.

పనుల్లో వేగం పెంచండి

జనగామ: పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని అదనపు కలెక్టర్‌ పింకేష్‌ కుమార్‌ అన్నారు. బుధవారం మున్సిపల్‌ పరిధిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల ను పరిశీలించారు. రంగప్పచెరువు నుంచి హైదరాబాద్‌ ప్రధాన రహదారి మీదుగా గార్లకుంటకు వరద నీటిని మళ్లించేందుకు సెయింట్‌ మేరీస్‌ స్కూల్‌కు వెళ్లే దారిలో చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అప్పటి వరకు ప్రధాన హైవేపై వన్‌వే రాక పోకలు జరుగుతాయని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా దయా నిలయం ఏరియాలో నిర్మాణం చేపట్టిన వెజ్‌, నాన్‌ వెజ్‌ మోడల్‌ మార్కెట్‌ పనులను పరిశీలించిన ఆయన పలు సూచనలు చేశారు. మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్లు, డీఈ రాజ్‌కుమార్‌, ఏఈ మహిపాల్‌ పాల్గొన్నారు.

టీపీసీసీ జిల్లా అబ్జర్వర్లుగా అద్దంకి, బైకిని..

జనగామ: కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం జిల్లా అబ్జర్వర్ల ను నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రతినిధి, తెలంగాణ ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ ఆదేశాల మేరకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌.. జిల్లాకు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌, బైకిని లింగంయాదవ్‌లను అబ్జర్వర్లుగా నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌, పాలకుర్తి నియోజకవర్గాల పరిధి ఎమ్మెల్యే, ఎంపీ, పార్టీ లోని అన్ని కేడర్‌లు, అనుబంధ సంఘాలు, ప్రజాప్రతినిధులు, మాజీలు ఇలా ప్రతి ఒక్కరి నీ అబ్జర్వర్లు సమన్వయం చేస్తూ పార్టీని మరింత బలోపేతం చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు కృషి చేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా జనగామకు చెంది న ఉమ్మడి వరంగల్‌ జిల్లా జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ లకావత్‌ ధన్వంతి యాదాద్రి భువనగిరి జిల్లా అబ్జర్వర్‌గా నియమితులయ్యారు.

ఉద్యోగుల సమస్యలపై

సంఘటిత పోరాటం

బచ్చన్నపేట : జీపీ ఉద్యోగులు ఎదుర్కొంటు న్న సమస్యలపై సంఘటితంగా పోరాడుతామ ని గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సాదుల శ్రీకాంత్‌ అన్నారు. బుధవా రం స్థానిక జీపీ కార్యాలయంలో ఆయన మా ట్లాడుతూ.. సమస్యల పరిష్కారానికి ఉద్యోగ కార్మికులు ఏకం కావాలన్నారు. తేలుకంటి మురళి, కొమురెళ్లి శ్రీనివాస్‌, కాళ్ల ప్రభాకర్‌, గొల్లపల్లి బాబుగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రధాన న్యాయమూర్తిగా ప్రతిమ బాధ్యతల స్వీకరణ1
1/1

ప్రధాన న్యాయమూర్తిగా ప్రతిమ బాధ్యతల స్వీకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement