కోతుల దాడిలో గాయాలు

గాయపడ్డ శ్రీధర్‌  - Sakshi

జనగామ: జనగామ పట్టణం నెహ్రూపార్కు ఏరియాలో మంగళవారం కోతుల దాడిలో జనగామ ఎంసీహెచ్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌ లగిశెట్టి శ్రీధర్‌ తీవ్రంగా గాయపడ్డారు. విధులు ముగించుకుని ఇంటికి వచ్చి బయట నిలబడ్డ సమయంలో పది కోతులు మూకుమ్మడి దాడి చేశాయి. అక్కడే ఉన్న తన కూతురు కర్ర పట్టుకుని అరవడంతో పారిపోయాయి. శ్రీధర్‌ కాలుతో పాటు పలుచోట్ల గాయాలయ్యారు. చికిత్స కోసం జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి వెళ్లారు. నెహ్రూపార్కు ఏరియాలోని ప్రైవేట్‌ స్కూల్‌ ఆవరణలో చెత్త డంపింగ్‌ చేయడంతోనే కోతులు, కుక్కలు విపరీతంగా వస్తున్నాయని, మున్సిపల్‌ అధికారులు వెంటనే స్పందించాలన్నారు.

షూటింగ్‌ బాల్‌ అసోసియేషన్‌ జిల్లా కమిటీ ఎన్నిక

జనగామ రూరల్‌: షూటింగ్‌ బాల్‌ అసోసియేషన్‌ జిల్లా కమిటీని మంగళవారం ఎన్నుకున్నారు. జిల్లా చైర్మన్‌గా ఇనుగాల యుగేందర్‌రెడ్డి, అధ్యక్షుడిగా మంద రమేష్‌, ఉపాద్యక్షుడిగా బొజ్జపల్లి సుభాష్‌, రజాక్‌, ప్రధాన కార్యదర్శిగా ఎ.కుమార్‌, సహాయ కార్యదర్శిగా జె.రాజు, సుధాకర్‌, కోశాధికారిగా బి.రమేష్‌ ఎన్నికయ్యారు. జిల్లా కేంద్రంలోని జూబ్లీగార్డెన్‌లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐలయ్య ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు.

Read latest Jangaon News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top