
సమ్మెలో మాట్లాడుతున్న రాపర్తి రాజు
జనగామ రూరల్: అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలి.. లేదంటే ఉద్యమం ఉధృతం చేస్తామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాపర్తి రాజు అన్నారు. గురువారం కలెక్టరేట్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంగన్‌వాడీలకు టీచర్లతో సమానంగా వేతనాలు ఇవ్వాలని, పెన్షన్, ఈఎస్‌ఐ ఇతర సదుపాయాలతోపాటు ఉద్యోగ భద్రత కల్పించాల ని డిమాండ్ చేశారు. 2017 నుంచి టీఏ, డీఏ బకా యిలు చెల్లించాలని, జిల్లా వ్యాప్తంగా ఖాళీ పోస్టుల ను భర్తీ చేయాలన్నారు. మీని కేంద్రాలను మెయిన్ సెంటర్లుగా మార్చడంతో పాటు ఎన్‌హెచ్‌టీఎస్ యాప్‌ను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశా రు. కార్యక్రమంలో బోట్ల శ్రీనివాస్, విజేందర్, మచ్చ శారద, సౌందర్య, రాజేశ్వరి, కల్పన, యాద మ్మ, రజిత, సుజాత, విజయ, రాణి, కవిత తదితరులు పాల్గొన్నారు.