మెట్పల్లి: ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు మున్సిపల్ కార్మికులను సొంత పనులకు వాడుకున్న వ్యవహారంపై విచారణ జరపాలని కాంగ్రెస్ నాయకులు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. విద్యాసాగర్‌రావు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 9 మంది కార్మికులతో ఇల్లు, ఫౌంహౌస్‌ల్లో పనులు చేయించుకున్నారని, ఎమ్మెల్యే సంజయ్ మూడేళ్లుగా ఇద్దరు కార్మికులను ఇంటి పనులకు వినియోగించుకుంటున్నారని తెలిపారు. ప్రజాధనం దుర్వినియోగం చేసినట్లు తేలితే వారి నుంచి రికవరీ చేయాలన్నారు. మున్సిపల్ మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు రైసుద్దీన్, వైస్‌చైర్మన్ ఓంకారి నవీన్, కౌన్సిలర్లు పందిరి రమేశ్, మాసుల ప్రవీణ్, రెబ్బాస్ మహేశ్, నరేష్, అజయ్, అజీం, పెంట ప్రణయ్, పిప్పెర రాజేశ్ పాల్గొన్నారు.


