జగిత్యాల: పీఆర్సీ వెంటనే ప్రకటించాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు తిరుకోవెల శ్యామ్‌సుందర్ అన్నారు. జిల్లాలోని పలు పాఠశాలల్లో సభ్యత్వ నమోదు చేపట్టారు. పెండింగ్ బిల్లులను క్లీయర్ చేయడంతోపాటు, బదిలీల ప్రమోషన్లు చేపట్టి పాఠశాల విద్య బలోపేతం చేయాలన్నారు. ఆదర్శ పాఠశాలలను 317 జీవోను అమలుచేయడంతో పాటు, 010 ద్వారా వేతనాలు ఇవ్వాలని కోరారు. కస్తూరిబా పాఠశాల ఉపాధ్యాయులు, సర్వశిక్ష ఉద్యోగులకు మినిమం స్కేలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు వొజ్జ శ్రీనివాస్, ప్రభాకర్ పాల్గొన్నారు.


