ఈ ప్రాంతంలో ఎప్పుడూ దొడ్డు రకం సాగు చేసేవాళ్లం. సన్న ధాన్యం సాగు చేయాలని ప్రభుత్వం ప్రకటించడంతో సన్నాలు సాగు చేశాం. మొన్నటివరకు క్వింటాల్‌కు రూ.4000 వరకు ఉంటే.. ఇప్పుడు రూ.2500 అంటున్నారు. ప్రభుత్వం రూ.వెయ్యి బోనస్ ఇవ్వాలి.
– మారు మురళీధర్ రెడ్డి, జిల్లా రైతు ఐక్యవేదిక నాయకుడు, మెట్‌పల్లి
వ్యాపారుల సిండికేట్ ఆపండి
వ్యాపారులు సిండికేట్‌గా మారి రైతులను దోచుకుంటున్నా ఎవరూ స్పందించడం లేదు. వారం వ్యవధిలోనే క్వింటాల్‌కు రూ.1600 రేటు తగ్గితే.. రైతు ఎకరాకు రూ.30వేల వరకు నష్టపోతున్నాడు. ప్రభుత్వ కేంద్రాలకు వస్తే ఇష్టం వచ్చినట్లు రైస్‌మిల్లర్లు దోచుకుంటున్నారు.
– పన్నాల తిరుపతి రెడ్డి, జిల్లా రైతు ఐక్యవేదిక నాయకుడు


