మెట్పల్లి: వెలమ కార్పొరేషన్ చైర్మన్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావుపై మెట్‌పల్లికి చెందిన పార్టీ సీనియర్ నాయకులు ఎర్రొల హన్మాండ్లు, జెట్టి లింగం, ఎండీ.షాకీర్, సంతోష్‌రెడ్డి శనివారం హైదరాబాద్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రి శ్రీధర్‌బాబును వేర్వేరుగా కలిసి ఫిర్యాదు చేశారు. పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టుల ఎంపిక విషయంలో నర్సింగరావు సీనియర్లను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదని వారి దృష్టికి తీసుకెళ్లినట్లు ‘సాక్షి’కి తెలిపారు. కొత్తగా చేరిన వారికి ప్రాధాన్యమిస్తూ.. దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేసిన సీనియర్లను పట్టించుకోవడం లేదని వివరించామన్నారు. వెల మ కార్పొరేషన్ చైర్మన్‌గా నర్సింగరావు బాధ్యతలు చేపట్టిన రోజే సీనియర్ నాయకులు ఆయనపై పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది.


