రాయికల్: ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో సాగు విస్తీర్ణం తగ్గనుంది. గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలకు ఉపాధి కరువవనుంది. స్థానికంగా ఉపాధి కల్పించేందుకు కేంద్రప్రభుత్వం వీబీజీరాంజీ (వికసిత్ భారత్ గ్యారంటీ రోజ్‌గార్ ఆజ్‌విక వికాస్ మిషన్ గ్రామీణ) పథకం కింద పనులు కల్పిస్తోంది. ఇందులో భాగంగా రైతుల కోసం జలసిరి పనులు, ఫాంపాండ్, గడ్డి పెంపకం, మామిడి మొక్కలు, ఆయిల్ పాం మొక్కలు, పంట కాలువలు, అటవీ ప్రాంతాల్లో నీటి నిల్వలు, కందకాలు, హార్వెస్టింగ్ పాండ్, ఇంకుడు గుంతల నిర్మాణం, కమ్యూనిటీ మ్యాజిక్, సోక్‌పిట్ పనులు చేపట్టనున్నారు.
పెరగనున్న ఉపాధి కూలీల సంఖ్య
ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం విస్తృత పనులు కల్పించాలనే లక్ష్యంతో ఉపాధిహామీ కూలీలకు పనిదినాల సంఖ్యను 100 నుంచి 125 రోజులకు పెంచింది. అర్హులైన కూలీలకు రోజు రూ.308 వేతనం చెల్లించి భరోసా కల్పిస్తోంది. ఈ పథకం జూలై 2 నుంచి అమలులోకి రావడంతో పనుల గుర్తింపు, గ్రామసభల ద్వారా తీర్మానాలను ఆగస్టు, సెప్టెంబర్‌లో పూర్తి చేశారు. గ్రామపంచాయతీ ఆమోదంతో మండలంలోని 32 గ్రామాల్లో ఈ పనులకు శ్రీకారం చుట్టారు. కరువు సమయంలో ఉపాధిహామీ కూలీలకు ఉపాధి దొరకనుంది.
నీటి సంరక్షణకే ప్రాధాన్యం
ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు వీబీజీరాంజీ పనులు గ్రామాల్లో మొదటగా నీటి సంరక్షణ పనులకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత, ప్రతి చేనుకు నీటికుంట, ఊటకుంట నిర్మాణాలకు గ్రామాల్లో చెరువు పూడికతీత పనులకు ప్రాధాన్యత కల్పిస్తున్నారు.
గ్రామాల్లో విస్తృతంగా పనులు
నీటి సమస్యకే ప్రాధాన్యత
గ్రామాలు
32
జాబ్‌కార్డులు
10,800
ఉపాధిహామీ పనుల్లో పాల్గొంటున్న కూలీలు 6200


