జగిత్యాల: మార్కెట్లో దీపావళి సందడి నెలకొంది. అన్ని వ్యాపార కేంద్రాల్లో పండుగ వాతావరణం నెలకొంది. బంతిపూలు, గుమ్మడికాయలు, పూజాసామగ్రి, ఇతరత్రా కొనుగోళ్లలో ప్రజలు బిజీగా కనిపించారు. ప్రమిదలు, టపాసుల కొనుగోళ్లతో జనసందోహంగా మారింది. కేదారేశ్వరస్వామి, లక్ష్మీపూజ కోసం పూజ సామగ్రికి గిరాకీ పెరిగింది. కుంకుమ, వత్తులు, లక్కాకులు, నల్లపూసలు, ఉసిరికాయలు కొనుగోలు చేశారు.
● ఆకట్టుకుంటున్న రకరకాల ప్రమిదలు
● బంతిపూల విక్రయాలు


