కరీంనగర్‌ ప్రజలకు రుణపడి ఉంటా.. | - | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌ ప్రజలకు రుణపడి ఉంటా..

Nov 8 2026 12:19 AM | Updated on Nov 8 2026 12:19 AM

కోరుట్ల: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ప్రజలకు రుణపడి ఉంటానని రాష్ట్ర వెలమ కార్పొరేషన్‌ చైర్మన్‌ జువ్వాడి నర్సింగరావు అన్నారు. హైదరాబాద్‌లోని మైత్రీవనంలో శనివారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా రాజకీయాల్లో తన తండ్రి జువ్వాడి సేవలు చిరస్మరణీయమని, ఆయన వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన తనకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తగిన గుర్తింపునిచ్చారని తెలిపారు. పని చేసే కార్యకర్తలకు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో తగిన గుర్తింపు దక్కుతుందన్నారు. పార్టీని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్తానన్నారు. కోరుట్ల నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నానని తెలిపారు. తన ప్రమాణ స్వీకారానికి భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. మంత్రులు శ్రీధర్‌ బాబు, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, వివేక్‌, ప్రభుత్వ సలహాదారు వేంనరేందర్‌ రెడ్డి, విప్‌ ఆది శ్రీనివాస్‌, జువ్వాడి కృష్ణారావు, జువ్వాడి చంద్రశేఖర్‌ రావు, కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపల్‌ చైర్మన్లు తిరుమల వసంత, మైలారపు లింబాద్రి, వివిద మండలాల కాంగ్రెస్‌ అధ్యక్షులు, పార్టీ శ్రేణులు, నాయకులు పాల్గొన్నారు.

జువ్వాడికి ఎమ్మెల్యే అభినందన

జగిత్యాల: మాజీమంత్రి రత్నాకర్‌రావు కుటుంబంతో తమకు మొదటి నుంచి అనుబంధం ఉందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ అన్నారు. శనివారం హైదరాబాద్‌లో వెల్మ కార్పొరేషన్‌ చైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా నర్సింగరావును అభినందించారు. భవిష్యత్‌లో మరిన్ని పదవులు పొందాలని ఆకాంక్షించారు.

కోరుట్ల అసెంబ్లీకి దక్కిన ప్రాధాన్యత

వెలమ కార్పొరేషన్‌ చైర్మన్‌ జువ్వాడి నర్సింగరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement