నృసింహుడి సన్నిధిలో రద్దీ | - | Sakshi
Sakshi News home page

నృసింహుడి సన్నిధిలో రద్దీ

Nov 8 2026 12:19 AM | Updated on Nov 8 2026 12:19 AM

ధర్మపురి: శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. గోదావరిలో స్నానాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.

ఈవీఎంల వద్ద భద్రత తప్పనిసరి

● కలెక్టర్‌ సత్యప్రసాద్‌

జగిత్యాల: ఈవీఎంల వద్ద భద్రత ఉండాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అన్నారు. ధరూర్‌ క్యాంప్‌లోని ఈవీఎం గోదాంలను శనివారం పరిశీలించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనల ప్రకారం భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆయన వెంట అదనపు కలెక్టర్‌ ప్రసూనాంబ, ఆర్డీవో మధుసూదన్‌, ఎలక్షన్‌ సూపరింటెండెంట్‌ జ్యోతి, అర్బన్‌ తహసీల్దార్‌ ఉన్నారు.

కలెక్టర్‌కు లోకాయుక్త నోటీసులు

జగిత్యాలటౌన్‌: నిషేధిత జాబితా (22ఏ)లో ఉన్న సర్వేనంబర్‌ 105లోని ప్రభుత్వ భూమిలో 621చదరపు గజాల స్థలాన్ని పెట్రోల్‌ పంప్‌ ఏర్పాటుకు ఆయిల్‌ కంపెనీకి లీజుకు ఇచ్చిన వ్యవహారంపై నివేదిక సమర్పించాలంటూ కలెక్టర్‌ సత్యప్రసాద్‌కు లోకాయుక్త నోటీసులు జారీ చేసింది. 2007 డిసెంబర్‌ ఒకటిన అప్పటి ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్‌ 1493 ప్రకారం ఆ స్థలాన్ని ఇళ్లు, కార్యాలయాల కోసం మాత్రమే వినియోగించాల్సి ఉందని, మార్కెట్‌ ధరలతో సంబంధం లేకుండా నామమాత్రపు అద్దెతో 2012 ఆగస్టు 14న జారీ చేసిన జీవో నంబర్‌ 571లోని క్లాజ్‌3(హెచ్‌)(డి)కి విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది. 120 ఏళ్ల నేపథ్యం కలిగిన రెవెన్యూ భవనాన్ని కూల్చి ఆ స్థలంలో పెట్రోల్‌ పంపు ఏర్పాటుకు పురావస్తు శాఖ అనుమతి తీసుకోలేదని పేర్కొంది. పంప్‌ ఏర్పాటుతో వెనుక వైపున్న రూ.కోట్లు విలువ చేసే స్థలం నిరుపయోగంగా మారే పరిస్థితి నెలకొందని పేర్కొంది. లీజును ఏకపక్షంగా ఇచ్చారని గతంలో మాజీమంత్రి జీవన్‌రెడ్డి చేసిన ఫిర్యాదును కలెక్టర్‌ పరిగణనలోకి తీసుకోలేదని పేర్కొంది.

కమ్యూనిటీ హాల్‌ అభివృద్ధికి నిధులు

కోరుట్ల రూరల్‌: మండలంలోని పైడిమడుగులో పద్మశాలి కమ్యూనిటీ భవనం అభివృద్ధికి నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ రూ.2.5 లక్షలు మంజూరు చేశారు. మంజూరు పత్రాలను బీజేపి జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబురావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యు డు వై.అనూప్‌రావు పద్మశాలి సంఘ నాయకులకు శనివారం అందించారు. సర్పంచ్‌ బడుగు భూమేశ్వర్‌, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు గుగ్గిళ్ల తుక్కారాం గౌడ్‌, పద్మశాలి సంఘం అధ్యక్షుడు అంకం బాబూలాల్‌, ఉపాధ్యక్షుడు అంకం శ్రీధర్‌, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

ఫైర్‌సేఫ్టీ నిబంధనలు తప్పనిసరి

జగిత్యాలక్రైం: టపాసుల గోదాముల్లో ఫైర్‌సేఫ్టీ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని డీఎస్పీ పురుషోత్తంరెడ్డి అన్నారు. శనివారం జగిత్యాల రూరల్‌ మండలం జాబితాపూర్‌లోని భారత్‌ ఫైర్‌వర్క్స్‌, తిప్పన్నపేట శివారులోని గణేశ్‌ ఫైర్‌వర్క్స్‌ గోదాంలను పరిశీలించారు. గోదాముల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దీపావళి పండగ నేపథ్యంలో రద్దీ పెరిగే అవకాశం ఉంటుందని, అప్రమత్తంగా ఉండాలన్నారు. భారత్‌ ఫైర్‌వర్క్స్‌ గోదాంలో ముగ్గురు మైనర్లు పనిచేస్తున్నట్లు గుర్తించి యజమానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనర్లను అదుపులోకి తీసుకుని, యజమానిపై కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement