ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య పెంచాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య పెంచాలి

Oct 31 2026 12:13 AM | Updated on Oct 31 2026 12:13 AM

రాయికల్‌: రాయికల్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య పెంచాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశానికి హాజరై మాట్లాడారు. ఆస్పత్రిలో మత్తు డాక్టర్‌, ముగ్గురు మహిళా వైద్యులు ఉన్నా ప్రసవాల సంఖ్య ఎందుకు తగ్గుతుందని, సంఖ్య పెరగాలని వైద్యులకు సూచించారు. జిల్లా కో ఆర్డినేటర్‌ రామకృష్ణ, కమిషనర్‌ మనోహర్‌గౌడ్‌, తహసీల్దార్‌ నాగార్జున, సూపరింటెండెంట్‌ శశికాంత్‌రెడ్డి, లయన్స్‌క్లబ్‌ అధ్యక్షుడు ప్రసాద్‌, తలారి రాజేశ్‌, స్పందన, సాగర్‌రావు, మచ్చ శేఖర్‌ పాల్గొన్నారు.

అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి

జగిత్యాల: అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం పట్టణంలోని తీన్‌ఖని వద్ద రూ.75 లక్షలతో ఉర్దూఘర్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఎస్‌ఈ రెహమాన్‌, ఈఈ లక్ష్మణ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

‘ఛలో ఢిల్లీ’ బయల్దేరిన నాయకులు

సర్‌ ప్రక్రియపై నిరసన తెలిపేందుకు ఛలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించి జగిత్యాల నుంచి కాంగ్రెస్‌ నాయకులు వెళ్తున్న బస్సును ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ జెండా ఊపి ప్రారంభించారు. డీసీసీ అధ్యక్షుడు నందయ్య, నాయకులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement