● సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్‌రావు
జగిత్యాలజోన్: పాఠశాలలు, స్నేహితులు, బంధువులు, తెలిసినవారితో ఏ సమస్య ఎదురైనా తల్లిదండ్రులతో చర్చించాలని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్‌రావు అన్నారు. జిల్లాకేంద్రంలోని గర్ల్స్ హైస్కూల్‌లో పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. బాలికలపై లైంగికదాడులకు పాల్పడితే శిక్షలు కఠినంగా ఉంటాయన్నారు. రెండో అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ నిఖిషా మాట్లాడుతూ.. గుడ్‌టచ్, బ్యాడ్ టచ్, వ్యక్తిగత భద్రత, అనుచిత ప్రవర్తనను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు భయం లేకుండా చెప్పాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. హెచ్‌ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
జగిత్యాలరూరల్: సైబర్ నేరాలపై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని నాబార్డ్ జిల్లా అభివృద్ధి అధికారి దిలీప్‌చంద్ర అన్నారు. సారంగాపూర్ మండలకేంద్రంలో సైబర్ నేరాల అప్రమత్తత, అక్షరాస్యతపై మంగళవారం అవగాహన కల్పించారు. ఎవరైనా అపరిచితులు కాల్ చేస్తే ఓటీపీ చెప్పొద్దన్నారు. కార్యక్రమంలో సారంగాపూర్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ వెంకట్‌రెడ్డి, సీనియర్ బిజినెస్ మేనేజర్ లక్ష్మీనారాయణరెడ్డి, ఫైనాన్షియల్ మేనేజర్ ప్రవీణ్, సర్పంచ్ చేకుట అరుణ పాల్గొన్నారు.
‘పీఎం రహత్’ వినియోగించుకోవాలి


