● ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
జగిత్యాల: అన్నివర్గాల ప్రజలు సోదరాభావంతో పండుగలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించుకోవడం అభినందనీయమని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. పట్టణంలో ముస్లింల ఆధ్వర్యంలో టీఆర్‌నగర్‌లో ఓర్సు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. టీఆర్‌నగర్‌లో నిరుపేదలకు జీవో 59 కింద 116 మందికి పట్టాలు, 200 మందికి డబుల్‌బెడ్‌రూంలు ఇచ్చామన్నారు. డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి, గిరి నాగభూషణం, మన్సూర్, చాంద్‌పాషా, లావణ్య, రాజేందర్, పద్మ రాజేందర్, గిరిధర్ పాల్గొన్నారు.
రక్తదానంతో ప్రాణాలు కాపాడవచ్చు
రక్తదానంతో ఇతరుల ప్రాణాలు కాపాడవచ్చ ని ఎమ్మెల్యే అన్నారు. ఐఎంఏ ఆధ్వర్యంలో డొనేట్ బ్లడ్, సేవ్ లైవ్స్ నిర్వహించారు. ఆపదలో ఉన్న ఎంతోమంది రక్తం కోసం ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలన్నారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్, ఐఎంఏ సెక్రటరీ ఆకుతోట శ్రీనివాస్‌రెడ్డి, కోశాధికారి సుధీర్, కౌన్సిలర్ ప్రశాంత్‌రావు, నాగరాజు, శంకర్, కృష్ణమూర్తి, రామకృష్ణ పాల్గొన్నారు.
ఎస్‌జీఎఫ్ వాలీబాల్ చాంపియన్‌గా జగిత్యాల రూరల్
జగిత్యాలరూరల్: జిల్లాస్థాయి ఎస్‌జీఎఫ్ అండర్–14 బాలికల వాలీబాల్ పోటీల్లో జగిత్యాలరూరల్ మండలం జట్టు చాంపియన్‌గా నిలిచింది. 20 మండలాలు పాల్గొన్న ఈ పోటీల్లో తమ జట్టు విజేతగా నిలవడం గర్వకారణ మని ఎంఈవో గంగాధర్ హర్షం వ్యక్తం చేశా రు. విజేతలకు ఎస్‌జీఎఫ్ సెక్రటరీ చేతుల మీదుగా ట్రోఫీ ప్రదానం చేశారు. వ్యాయామ ఉపాధ్యాయులు కోటేశ్వరరావు, అజయ్ బాబు, మల్లీశ్వరి, వెంకటలక్ష్మి, జమున, హారిక, రాజ్ చందర్, రాధిక పాల్గొన్నారు.
ముందస్తు పరీక్షలతో వ్యాధుల నివారణ
రాయికల్: ముందస్తు పరీక్షలతోనే వ్యాధుల నివారణ సాధ్యమని డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్ అన్నారు. మండలంలోని అల్లీపూర్‌లో హెచ్‌ఐవీ, టీబీ పరీక్షల శిబిరాన్ని పరిశీలించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా ఎక్స్‌రే, బీపీ, డయాబెటిస్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మొబైల్ ఎక్స్‌రే ద్వారా 72 మందికి పరీక్షలు నిర్వహించారు. మండల వైద్యాధికారి సతీశ్, సర్పంచ్ గౌతమి, ఉపసర్పంచ్ వినయ్, ఎంఎల్‌హెచ్‌పీ సుప్రియ, సత్యవేద, సూపర్‌వైజర్ శ్రీనివాస్, ఉమారాణి, వికాస్ పాల్గొన్నారు.


