పోరాట యోధురాలు ఐలమ్మ | - | Sakshi
Sakshi News home page

పోరాట యోధురాలు ఐలమ్మ

Sep 11 2026 9:46 AM | Updated on Sep 11 2026 9:46 AM

● కలెక్టర్‌ సత్యప్రసాద్‌

● కలెక్టర్‌ సత్యప్రసాద్‌

జగిత్యాల: రైతాంగ పోరాటంలో చాకలి ఐలమ్మ త్యాగాలు మరువలేనివని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అన్నారు. ఐలమ్మ వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్‌లో ఆమె చిత్రపటానికి నివాళి అర్పించారు. ఆమె త్యాగాలను గుర్తిస్తూ జయంతి, వర్ధంతి వేడుకలను ప్రభుత్వం అధికారకంగా నిర్వహిస్తోందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లత, రాజాగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

మట్టి విగ్రహాలనే పూజించాలి..

పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకులనే పూజించాలని కలెక్టర్‌ తెలిపారు. కలెక్టరేట్‌లోని కాలుష్య నియంత్రణ మండలి రూపొందించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. పీవోపీ విగ్రహాలతో జలాశయాలు, చెరువులు, కుంటలు కలుషితమయ్యే ప్రమాదం ఉందన్నారు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో రెండువేల మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు. ఎన్విరాన్‌మెంట్‌ అసిస్టెంట్‌ సైంటిస్ట్‌ మహేశ్‌, తదితరులు ఉన్నారు.

రీ సర్వే పారదర్శంగా నిర్వహించాలి

గ్రామాల్లో భూ రీసర్వేను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్‌ అన్నారు. కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించారు. భూ రీసర్వేలో అధికారులకు ఎదురవుతున్న సమస్యలు తెలుసుకున్నారు. మున్సిపాలిటీలో నక్షా పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement