ఒకరి అనుమానాస్పద మృతి | - | Sakshi
Sakshi News home page

ఒకరి అనుమానాస్పద మృతి

Sep 11 2026 9:46 AM | Updated on Sep 11 2026 9:46 AM

రాష్ట్రాన్ని దివాళా తీయించారు

కరీంనగర్‌క్రైౖం: నగరంలోని కోతిరాంపూర్‌కు చెందిన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వన్‌టౌన్‌ పోలీసుల వివరాల ప్రకారం కోతిరాంపూర్‌కు చెందిన బండ మల్లేశం (45) గతంలో మేసీ్త్రగా పనిచేసేవాడు. ఐదేళ్లుగా మద్యానికి బానిసయ్యడు. బుధవారం రాత్రి మల్లేశం చాతిలో నొప్పిగా ఉందని కుటుంబ సభ్యులకు చెప్పాడు. చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించగా, అప్పటికే మృతి చెందాడు. మృతుడి భార్య సుజాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

డ్రంకెన్‌ డ్రైవ్‌లో ఒకరికి జైలు

గోదావరిఖని: డ్రంకెన్‌ డ్రైవ్‌లో కేసులో ఆటో డ్రైవర్‌కు ఒకరోజు జైలు శిక్ష విధించినట్లు ట్రాఫిక్‌ సీఐ రాజేశ్వర్‌రావు తెలిపారు. డ్రంకెన్‌ డ్రైవ్‌లో దొరికిన 8మందిని కోర్టులో హాజరుపర్చగా ఏడుగురికి రూ.21,000లు నగదు జరిమానా విధించగా, ఒకరికి జైలు శిక్ష విధించారన్నారు. అలాగే కమిటీ సర్వీస్‌లో భాగంగా రూ.3వేల నోట్‌బుక్స్‌ను విద్యార్థులకు వారి ద్వారా అందించారు.

షార్ట్‌ సర్క్యూట్‌తో గుడిసె దగ్ధం

కోనరావుపేట(వేములవాడ): మండలంలోని బావుసాయిపేటలో షార్ట్‌ సర్క్యూట్‌తో గుడిసె దగ్ధమైంది. గ్రామానికి చెందిన షేక్‌ హోలీగౌసీబీకి చెందిన గుడిసెలో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో గుడిసెతోపాటు సామగ్రి కాలిపోయింది. బాధిత కుటుంబాన్ని సర్పంచ్‌ షేక్‌ యాస్మిన్‌పాషా, ఉపసర్పంచ్‌ తిక్కల నవీన్‌ పరామర్శించారు. సంఘటన స్థలాన్ని ఆర్‌ఐ సంతోష్‌ సందర్శించి పంచనామా చేశారు.

కాపర్‌ వైర్‌ చోరీ

మంథనిరూరల్‌: పంటలకు సాగునీరు అందించేందుకు రైతులు ఏర్పాటు చేసుకున్న విద్యుత్‌ మోటార్లకు కరెంటు సరఫరా అయ్యే వైర్ల నుంచి కాపర్‌ వైర్‌ను చోరీ చేసిన సంఘటన మంథని మండలం ఖానాపూర్‌లో గురువారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖానాపూర్‌ గ్రామశివారులోని గోదావరినది, బొక్కలవాగుల నుంచి సుమారు 30మంది రైతులు విద్యుత్‌ మోటార్లు అమర్చుకుని పంటలకు సాగునీరు అందిస్తున్నారు. ఆ విద్యుత్‌ మోటార్లకు సరఫరా అయ్యే వైర్లను గుర్తు తెలియని వ్యక్తులు కట్‌ చేసి అందులోని కాపర్‌ వైర్లను ఎత్తుకెళ్లారు. గురువారం అటువైపు వెళ్లిన రైతులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి వివరాలు సేకరించారు. 30మంది రైతులకు సుమారు రూ.2నుంచి 3లక్షల వరకు నష్టం జరిగిందన్నారు. కాపర్‌ వైర్‌ దొంగిలించిన వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

భర్త వద్దకు యువతి

జగిత్యాలక్రైం: ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతిని కుటుంబసభ్యులు, బంధువులు రెండుకార్లలో వచ్చి తీసుకెళ్లిన ఘటన జగిత్యాలరూరల్‌ మండలం అంతర్గాంలో బుధవారం చోటుచేసుకున్న విషయం తెల్సిందే. యువకుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతి స్వగ్రామమైన కామారెడ్డి జిల్లా బీచ్కుంద మండలం సీతారాంపల్లికి వెళ్లారు. సదరు యువతి బంధువుల ఇంట్లో ఉండగా పోలీసులు గుర్తించి జగిత్యాలకు తీసుకొచ్చి భర్త ప్రశాంత్‌కు అప్పగించారు.

● కాంగ్రెస్‌ పాలనపై మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

పెద్దపల్లి: కాంగ్రెస్‌ పాలనలో రాష్ట్రం దివాళా తీస్తోందని మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. పెద్దపల్లి జిల్లాకేంద్రంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రయోజనాలను పక్కనపెట్టి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆదేశాలకు తలొగ్గుతోందని మండిపడ్డారు. కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుల మోటార్లు అందుబాటులో ఉన్నా.. కావాలని ఆన్‌చేయడం లేదని ఆరోపించారు. కాళేశ్వరంలో చిన్నపాటి మరమ్మతులతో సమస్య పరిష్కరించగలిగే అవకాశం ఉన్నా.. కేసీఆర్‌పై కక్షతో ఉత్తర తెలంగాణను ఎండబెడుతున్నారని విమర్శించారు. శ్రీశైలంలో తాగునీటి అవసరాల పేరుతో తెలంగాణకు నీటిని నిరాకరిస్తూ.. మరోవైపు పోతిరెడ్డిపాడు, వెలిగొండ మార్గాల ద్వారా ఏపీ నీటిని తరలించుకుపోతున్నా.. ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక కేసీఆర్‌పై ఆరోపణలు చేస్తున్నారని, రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్‌ కిట్‌ వంటి పథకాలను పక్కనపెట్టారని, బీసీ సబ్‌ప్లాన్‌, 42 శాతం రిజర్వేషన్లు, గొర్రెల పంపిణీ వంటి హామీలను విస్మరించారని తెలి పారు. 22ఏ భూముల విషయంలో రైతులు ఇబ్బంది పడుతున్నారని, నాయకులు, అ ధికారులు పర్సంటేజీ తీసుకుంటున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే 22ఏ నిబంధన, హైడ్రా రద్దు చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement