● రూ.35.19 కోట్లతో దీక్షా విరమణ మండపం, సత్రం ● 2వేల మంది ఒకేసారి దీక్షవిరమించేలా నిర్మాణం
కరీంనగర కార్పొరేషన్: కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానానికి సంబంధించిన అభివృద్ధి పనులకుమోక్షం లభించింది. అంజన్న భక్తుల చిరకాల కోరికై న మాల విరమణ మండపం,సత్రం గదుల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని గురువారం డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండిఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కలిసి అభివృద్ధి పనులపై చర్చించారు.
రూ.35.19 కోట్లతో మండపం, సత్రం నిర్మాణం
కొండగట్టు శ్రీఆంజనేయస్వామి దేవస్థానంలో రూ.35.19కోట్ల నిధులతో చేపట్టనున్న మండపం, సత్రం నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం ఇచ్చింది. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో దీక్షా విరమణ మండపం, భక్తుల కోసం 96 గదుల సత్రం నిర్మాణాలకు రూ. 35.19 కోట్ల నిధులు మంజూరై శంకుస్థాపన జరిగినప్పటికీ.. సాంకేతిక కారణాలతో పనులు నిలిచిపోయాయి. స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి పనులు ప్రారంభించేలా చూడాలని అభ్యర్థించారు. సానుకూలంగా స్పందించిన సీఎం వెంటనే పెండిగ్ పనులకు ఆమోదం తెలిపారు. కాగా రూ.35.19 కోట్లతో మాలదారులు రెండు వేల మంది ఒకే సారి దీక్ష విరమణ చేసుకొనేందుకు వీలుగా మండపం నిర్మాణం చేపట్టనున్నారు. భక్తుల సౌకర్యార్థం 96గదుల సత్రం, అతిథిగృహం నిర్మించనున్నారు. ఈ నిర్మాణాలతో ఏటా లక్షలాదిగా వచ్చే హనుమాన్ మాలాధారులకు, అంజన్న భక్తులకు ఎంతో సౌకర్యం కలుగుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యం తెలిపారు. త్వరలోనే టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామన్నారు.


