తొలిదశలో గుర్తిస్తే చికిత్స అందించొచ్చు | - | Sakshi
Sakshi News home page

తొలిదశలో గుర్తిస్తే చికిత్స అందించొచ్చు

Sep 11 2026 9:46 AM | Updated on Sep 11 2026 9:46 AM

కరీంనగర్‌: క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించి సకాలంలో చికిత్స అందిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని హైదరాబాద్‌ మెడికవర్‌ క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ అంకాలజిస్టు డాక్టర్‌ అన్వేశ్‌, డాక్టర్‌ నీలేశ్‌, డాక్టర్‌ స్నేహ తెలిపారు. కరీంనగర్‌ మెడికవర్‌ ఆస్పత్రిలో గురువారం నిర్వహించిన ఉచిత క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ శిబిరానికి 126 మంది హాజరై పరీక్షలు చేయించుకోగా, 16 మందికి పాజిటివ్‌గా గుర్తించినట్లు వైద్యులు తెలిపారు. క్యాన్సర్‌ కేసుల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రతీ నెల రెండో కరీంనగర్‌ మెడికవర్‌ ఆసుపత్రిలో ఉచిత స్క్రీనింగ్‌ శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వైద్యులు మాట్లాడుతూ కరీంనగర్‌లో బ్రెస్ట్‌ క్యాన్సర్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని తెలిపారు.

మెడికవర్‌ క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ వైద్యులు

ఉచిత క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ శిబిరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement