ప్రజల్లో చైతన్యం నింపిన మహనీయుడు కాళోజీ | - | Sakshi
Sakshi News home page

ప్రజల్లో చైతన్యం నింపిన మహనీయుడు కాళోజీ

Sep 9 2026 11:57 PM | Updated on Sep 9 2026 11:57 PM

● కలెక్టర్‌ సత్యప్రసాద్‌

● కలెక్టర్‌ సత్యప్రసాద్‌

కరీంనగర్‌: పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది అంటూ ప్రజల్లో చైతన్యం నింపిన మహనీయుడు కాళోజీ అని కలెక్టర్‌ సత్యప్రసా ద్‌ అన్నారు. కాళోజీ నారాయణరావు జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆయన తన రచనల ద్వారా ప్రజాసమస్యలు, సామాజిక రుగ్మతలు, అన్యాయాలను ఎత్తిచూపుతూ ప్రజల్లో చైతన్యం తెచ్చారన్నారు. సామాజిక మార్పు కోసం చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. తెలుగు భాష, యాస, సంస్కృతి, సంప్రదాయాలపై కాళోజీకి అపారమైన అభిమానం ఉండేదన్నారు. అదనపు కలెక్టర్లు లత, రాజాగౌడ్‌ పాల్గొన్నారు.

భూముల రీ సర్వే పకడ్బందీగా చేపట్టాలి

పెగడపల్లి: భూముల రీ సర్వే ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని అడిషనల్‌ కలెక్టర్‌ బీఎస్‌.లత తెలిపారు. పైలట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన మండలంలోని ల్యాగలమర్రిలో జరుగుతున్న రీ సర్వేను బుధవారం పరిశీలించారు. సర్వేలో పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ప్రతి సర్వే నంబర్‌ను వరుస క్రమంలో కచ్చితంగా నమోదు చేయాలన్నారు. ఇది రైతులకు ఎంతో మేలని, ఇందుకు సహకరించాలని రైతులకు సూచించారు. సర్పంచ్‌ ఎల్గటూరి రవి, తహసీల్దార్‌ సయ్యద్‌ నిజామొద్దీన్‌, ఆర్‌ఐ శ్రీనివాస్‌, సర్వేయర్‌ తనూజ, రైతులు పాల్గొన్నారు.

నేరాల నియంత్రణలో సీసీకెమెరాలు దోహదం

జగిత్యాలక్రైం: నేరాల నియంత్రణలో సీసీకెమెరాలు దోహదం చేస్తాయని జగిత్యాల డీఎస్పీ పురుషోత్తంరెడ్డి అన్నారు. జగిత్యాల రూరల్‌ మండలం నర్సింగాపూర్‌లో సర్పంచ్‌ కుకునూరి వంశీ దాతల సహకారంతో ఏర్పాటు చేసిన 22 సీసీ కెమెరాలను ఆయన బుధవారం ప్రారంభించారు. ప్రజలు తమ వ్యాపార సముదాయాలు, నివాస ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే నేరాలను నియంత్రించవచ్చన్నారు. రూరల్‌ సీఐ సుధాకర్‌, ఎస్సై ఉమాసాగర్‌, ఉపసర్పంచ్‌, గ్రామ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

మాస శివరాత్రి పూజలు

జగిత్యాలరూరల్‌: మాస శివరాత్రి సందర్భంగా జగిత్యాలరూరల్‌ మండలం పొలాస శివారులోని సహస్ర లింగాల దేవాలయంలో మహిళలు పూజలు నిర్వహించారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ అడువాల జ్యోతి, లక్ష్మణ్‌ దంపతులు పూజలు చేశారు. ఆలయ వ్యవస్థాపకులు నలమాసు గంగాధర్‌, భక్తులు పాల్గొన్నారు.

విద్యార్థి దశ విలువైంది

కరీంనగర్‌: విద్యార్థి దశ విలువైందని ఎస్‌కేఎన్‌ఆర్‌ (ప్రభుత్వ) కళాశాల ప్రిన్సిపాల్‌ ఇందిరాదేవి అన్నారు. కళాశాలలో యుపోరియా–2026 పేరుతో బుధవారం వార్షికోత్సవం నిర్వహించారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదువుపై దృష్టి సారించాలన్నారు. రెడ్‌క్రాస్‌ సొసైటీ కార్యదర్శి మంచాల కృష్ణ మాట్లాడు తూ.. చదువుతోపాటు, మానసిక ప్రశాంతత, మానవీయ విలువలు అలవర్చుకోవాలన్నారు. ఇంటర్మీడియెట్‌ నోడల్‌ అధికారి రమేశ్‌బాబు మాట్లాడుతూ ప్రస్తుతం అర్టిఫిషియల్‌ ఇంటలీజెన్సీ నైపుణ్యాలను విద్యార్థులు సాధించాలన్నారు. అనంతరం విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో వైస్‌ ప్రి న్సిపల్‌ శ్రీనివాస్‌, అధ్యాపకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement