ఊరేగింపు.. పొంచిన ఉన్న ముప్పు | - | Sakshi
Sakshi News home page

ఊరేగింపు.. పొంచిన ఉన్న ముప్పు

Sep 9 2026 11:57 PM | Updated on Sep 9 2026 11:57 PM

● గతేడాది కోరుట్ల పట్టణంలో తయారు చేసిన వినాయక విగ్రహాలను విక్రయ కేంద్రాలకు తరలిస్తున్నారు. విగ్రహాలు ఎత్తులో ఉండడం.. కరెంట్‌ తీగలు కిందకు వేలాడుతుండడం.. తయారీదారులు గమనించకుండా తరలిస్తుండగా విద్యుత్‌షాక్‌ తగిలి ఇద్దరు మృతిచెందారు. ఇదే ఘటనలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ● రెండు రోజుల క్రితం జిల్లాకేంద్రంలోని అంగడిబజార్‌లో అధికారులకు సమాచారం లేకుండా వినాయకుని భారీ విగ్రహాన్ని తరలించేందుకు సిద్ధపడుతున్నారు. విద్యుత్‌ వైర్లు అడ్డురావడంతో సుమారు రెండు గంటలపాటు విద్యుత్‌ అధికారులు సరఫరా నిలిపివేశారు. వినాయకుడి విగ్రహాన్ని తరలించేలా చర్యలు చేపట్టారు. అంతసేపు ట్రాఫిక్‌ ఏర్పడింది. విద్యుత్‌ అంతరాయం కలగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ● సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం అనుమతి లేని, పరిమితికి మించిన డీజేలను వాడితే సీజ్‌ చేయడంతోపాటు నిర్వాహకులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తారు. ● విగ్రహాల ఎత్తు, మార్గాల సమాచారాన్ని ముందస్తుగా విద్యుత్‌ శాఖ, ట్రాఫిక్‌ పోలీసులకు తెలియజేయాలి. ● రోడ్లపై అడ్డదిడ్డంగా వాహనాలు నిలపడం, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగిస్తే వాహనాలను సీజ్‌ చేస్తారు. ● చెవుడు తెప్పించే డీజేలు, ప్రమాదకరమైన లేజర్‌ లైట్ల జోలికి వెళ్లొద్దు. సంస్కృతిని ప్రతిబింబించే మంగళవాయిద్యాలు, డప్పులు, భజనలతో ఊరేగింపు చేపట్టాలి. ● విగ్రహాన్ని తరలించే మార్గంలో కరెంట్‌ వైర్లు, కేబుల్స్‌ ఎత్తులో ఉన్నాయా..? కిందకు వేలాడుతున్నాయా..? ముందే గమనించాలి. తరలింపు సమయంలో వాహనంపై విద్యుత్‌ రహిత చెక్క కర్రలతో నిపుణులైన వ్యక్తులను మాత్రమే ఉంచాలి.

వినాయక విగ్రహాల రవాణా విషాదం కావొద్దు ఉత్సవాల్లో అపశ్రుతులకు తావివ్వొద్దు గతేడాది కోరుట్లలో విద్యుత్‌షాక్‌తో ఇద్దరు మృతి మరో నలుగురికి తీవ్ర గాయాలు

జగిత్యాలక్రైం: పట్టణాలు, గ్రామాల్లో వాడవాడలా గణేశ్‌ నవరాత్రోత్సవాల సందడి మొదలైంది. బొజ్జ గణపయ్యను మండపాలకు ఆహ్వానించేందుకు యువత, ఉత్సవ కమిటీలు పోటీపడుతూ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాయి. అయితే భక్తిశ్రద్ధలతో ప్రశాంతంగా సాగాల్సిన గణేశుడి ఆగమనం.. కొన్నిసార్లు ప్రమాదాలకు వేదికవుతోంది. గతంలో వినాయకుడి విగ్రహాన్ని మేళతాళాలు, భజనలతో మంగళకరమైన వాతావరణంలో మండపానికి తీసుకొచ్చేవారు. కొన్నేళ్లుగా మహారాష్ట్ర తరహాలో ఆగమనం పేరిట ఇటీవల విపరీత పోకడలు పెరిగిపోయాయి. ట్రాలీలు, లారీలపై వేలాడే భారీ డీజే సౌండ్‌ బాక్సులు, ఊపిరాడకుండా కాల్చే బాణసంచా పొగ, యువకుల చిందులు.. వెరసీ కొన్నిచోట్ల ప్రమాదకర విన్యాసంగా మారుతోంది. ఆర్భాటం, సోషల్‌ మీడియాలో రీల్స్‌ మోజు, విచ్చలవిడి పోటీతత్వం కారణంగా ఏర్పాటు చేస్తున్న డీజేలు, కళ్లు బైర్లు కమ్మేలా లేజర్‌ లైట్లు, ట్రాఫిక్‌ను స్తంభింపజేస్తూ చేస్తున్న విన్యాసాలు పండుగ ఆనందాన్ని మిగల్చకపోగా.. పచ్చని కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతున్నాయి. వినాయక చవితి ఉత్సవాల్లో ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని జిల్లా అధికార యంత్రాంగం సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నారు.

ఆదేశాలు పాటించాల్సిందే..

నిబంధనలు కఠినతరం

నవరాత్రోత్సవాలను భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి. ఆగమనం పేరిట నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం డీజేలపై నిషేధం ఉంది. రహదారులపై ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించొద్దు. విగ్రహాల తరలింపు వేళ ప్రమాదకర స్టంట్లు చేయొద్దు.

– అశోక్‌కుమార్‌, ఎస్పీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement