జేఎన్టీయూలో ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌ | - | Sakshi
Sakshi News home page

జేఎన్టీయూలో ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌

Sep 9 2026 11:57 PM | Updated on Sep 9 2026 11:57 PM

● వివిధ ఉద్యోగాలకు 82 మంది ఎంపిక

● వివిధ ఉద్యోగాలకు 82 మంది ఎంపిక

కొడిమ్యాల: మండలంలోని జేఎన్టీయూ(నాచుపల్లి )లో వర్టికల్‌ సొల్యూషన్స్‌ సంస్థ ఆధ్వర్యంలో బుధవారం ప్రాంగణ నియామకాలు చేపట్టారు. ఈఈఈ, ఈసీఈ, మెకానికల్‌ విభాగాలకు చెందిన 82 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికై నట్లు సంస్థ హెచ్‌ఆర్‌ సబర్‌ తెలిపారు. యాపిల్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ అసెంబ్లింగ్‌ విభాగానికి 68 మంది, బీవైడీ సంస్థకు 14 మంది ఎంపికయ్యారు. అమ్మాయిలకు నెలకు రూ.20వేల వేతనం, ఉచిత భోజన వసతి, రవాణా, అబ్బాయిలకు నెలకు రూ.32,500 చెల్లిస్తారని పేర్కొన్నారు. హన్సన్‌ టెక్నాలజీస్‌ సంస్థలు ఫుల్‌ స్టాక్‌ డెవలపర్‌, డేటా మేనేజ్మెంట్‌ రోల్‌కు సంబంధించి సీఎస్సీ విభాగంలో ఒకరు, ఐటీ విభాగంలో ముగ్గురు విద్యార్థినులు టెక్నికల్‌ రౌండ్‌కు ఎంపికయ్యారని, ఆఖరి రౌండ్‌లో ఎంపికై న వారికి ఏడాదికి రూ.6.7 లక్షల వేతనం లభిస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులను ప్రిన్సిపల్‌ నరసింహ అభినందించారు. ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌ సతీష్‌కుమా ర్‌ కృషిని ప్రశంసించారు. వైస్‌ ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌, బోధన, బోధేనతర సిబ్బంది పాల్గొన్నారు.

ఉపకరణల నిర్ధారణ శిబిరం

కరీంనగర్‌: సమగ్ర శిక్ష అభియాన్‌ అలింకో ఆధ్వర్యంలో ఈనెల 10న కోరుట్ల, 11న జగిత్యాల డివి జన్‌లో దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణల నిర్ధారణ శిబిరం నిర్వహించనున్నట్లు డీఈవో రాము తెలి పారు. కోరుట్ల భవిత కేంద్రం, జిల్లాకేంద్రంలో పురాతన హైస్కూల్‌లో శిబిరం నిర్వహిస్తామన్నా రు. ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలన్నారు. ఆశావర్కర్లు చొరవ చూపాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement