ప్రైవేటు ఆస్పత్రుల్లో నిబంధనలు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రైవేటు ఆస్పత్రుల్లో నిబంధనలు పాటించాలి

Sep 9 2026 11:57 PM | Updated on Sep 9 2026 11:57 PM

కరీంనగర్‌: జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో నిబంధనలు పాటించాలని, బయోమెడికల్‌ వ్యర్థాలను వేరు చేసి కలర్‌ కోడెడ్‌ బిన్‌లలో నిల్వ చేసి ఏజెన్సీ ద్వారా తరలించాలని డీఎంహెచ్‌వో సుజాత అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేటు ఆస్పత్రులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు వసతులు కల్పించాలని ఆదేశించారు. ఆస్పత్రుల్లో టారిఫ్‌ బోర్డులు ఏర్పాటు చేసి వైద్యసేవలు, పరీక్షలు, సంబంధించిన చార్జీల వివరాలు స్పష్టంగా ప్రదర్శించాలన్నారు. ఆస్పత్రుల్లో క్లీనికల్‌ ఎస్లాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌ ప్రకారం రిజిస్ట్రేషన్‌, రికార్డులు ఉండాలని పేర్కొన్నారు. ఆస్పత్రుల్లో సేవలందిస్తున్న డాక్టర్లు, నర్సులు, ల్యాబ్‌లు నిబంధనల ప్రకారం ఉండాలన్నారు. ఆమె వెంట వైద్య సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement